Viral Video: సెలూన్‌లో వానరం.. నేరుగా వచ్చి సీట్లో కూర్చుని ట్రిమ్మింగ్ చేయించుకుంది!

ABN , First Publish Date - 2021-12-03T22:46:12+05:30 IST

మనుషులను అనుకరిస్తూ కోతులు చేస్తున్న చేష్టలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: సెలూన్‌లో వానరం.. నేరుగా వచ్చి సీట్లో కూర్చుని ట్రిమ్మింగ్ చేయించుకుంది!

మనుషులను అనుకరిస్తూ కోతులు చేస్తున్న చేష్టలకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలు ఆసక్తి కలిగిస్తుంటే.. మరికొన్ని నవ్వు పుట్టిస్తున్నాయి. తాజాగా ఓ సెలూన్‌లో ట్రిమ్మింగ్ చేయించుకున్న వానరానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో‌ వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 


45 సెకెండ్లు ఉన్న ఆ వీడియో క్లిప్‌లో సెలూన్‌లో అద్దం ముందు ఉన్న కుర్చీలో కోతి కూర్చుని ఉంది. హెయిర్ డ్రెస్సర్ ఆ కోతి చుట్టూ క్లాత్ కప్పి దువ్వెనతో దువ్వుతూ ట్రిమ్మింగ్ చేశాడు. అతను పని పూర్తి చేసే వరకు ఆ కోతి చాలా సహనంగా కూర్చుని ఉంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2021-12-03T22:46:12+05:30 IST