Viral Video: ఇది పబ్లిక్ ప్లేస్! బాగుండదంటూ.. యువకుడు వారిస్తున్నా వినకుండా.. యువతి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-07-15T03:07:55+05:30 IST

కొందరు ప్రేమికులు చిన్న చిన్న విషయాలకూ సీరియస్‌గా కొట్టుకుంటుంటారు. మరికొందరు ప్రేమికులు ఒకరినొకరు ఆట పట్టించే క్రమంలో అందరిలో గొడవ చేస్తుంటారు. ఇంకొందరు..

Viral Video: ఇది పబ్లిక్ ప్లేస్! బాగుండదంటూ.. యువకుడు వారిస్తున్నా వినకుండా.. యువతి ఏం చేసిందంటే..

కొందరు ప్రేమికులు చిన్న చిన్న విషయాలకూ సీరియస్‌గా కొట్టుకుంటుంటారు. మరికొందరు ప్రేమికులు ఒకరినొకరు ఆట పట్టించే క్రమంలో అందరిలో గొడవ చేస్తుంటారు. ఇంకొందరు ప్రేమికులైతే.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. కావాలని అలా చేశారో.. లేక నిజంగానే చేశారో తెలీదు గానీ.. ప్రేమికులకు సంబంధించిన ఓ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది..


ఢిల్లీలోని మెట్రో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు వెళ్తూ ఉండగా, ప్రయాణికుల సమక్షంలో ప్రేమికుల మధ్య గొడవ మొదలవుతుంది. ముందుగా యువతి తన చేతిలోని టీ షర్ట్‌ను ప్రేమికుడికి చూపించి.. రూ.1000కి కొన్నా అని చెబుతుంది. ఇందుకు సమాధానంగా అతను.. అంత ధర ఉండదు, కేవలం రూ.150 ఉంటుందని ఎగతాళి చేస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి.. అతన్ని చెంప మీద గట్టిగా కొడుతుంది. కొద్ది సేపటి తర్వాత యువకుడు కూడా ఆమెను కొడతాడు. దీంతో ఆమె ‘‘ ఇంటికెళ్లి మా అమ్మకు చెప్పి.. నీ సంగతి చెబుతా’’.. అంటూ రైలు దిగి వెళ్లిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వీళ్లు కావాలనే అలా ప్రాంక్ చేశారని కొందరు అంటుంటే.. వీళ్లకి వివాహమైతే భవిష్యత్తులో పరిస్థితి ఇంకెలా ఉంటుందో.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral photo: ఎద్దులపై భారం పడకుండా.. విద్యార్థుల వినూత్న ఐడియా.. అద్భుత ఆవిష్కరణ అంటూ నెటిజన్ల ప్రశంసలు..





Updated Date - 2022-07-15T03:07:55+05:30 IST