Viral Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న బుడ్డోడు.. మొట్టమొదటిసారి కేక్‌ను తిన్నాక చిన్నారి రియాక్షన్ అదుర్స్..

ABN , First Publish Date - 2022-06-23T20:16:14+05:30 IST

మీరు మొదటి సారి మంచి వంటకాన్ని తిన్నప్పుడు, అది పూర్తిగా రుచికరమైనదని గ్రహించినప్పుడు మీరు ఎలా స్పందించారో గుర్తుందా?

Viral Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న బుడ్డోడు.. మొట్టమొదటిసారి కేక్‌ను తిన్నాక చిన్నారి రియాక్షన్ అదుర్స్..

మీరు మొదటి సారి మంచి వంటకాన్ని తిన్నప్పుడు, అది పూర్తిగా రుచికరమైనదని గ్రహించినప్పుడు మీరు ఎలా స్పందించారో గుర్తుందా? తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో బుడ్డోడి రియాక్షన్ చూస్తే మీరు కూడా అలాగే స్పందించి ఉంటారని అనుకుంటారు. మొదటి సారి ఫన్నెల్ కేక్ రుచి చూసిన తర్వాత ఆ బుడ్డోడు ఇచ్చిన రియాక్షన్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. టిక్‌టాక్‌లో మంచి ఆదరణ పొందిన ఈ వీడియోను `హుడ్ కామెడీ` అనే ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. 


స్ట్రోలర్‌లో ఉన్న పిల్లాడి చేతికి ఒక వ్యక్తి ఫన్నెల్ కేక్ (అమెరికాలో బాగా పాపులర్) ముక్క అందించాడు. ఆ బుడ్డోడు దానిని తీసుకుని నోట్లో పెట్టుకుని నమిలాడు. ఆ తర్వాత అద్భుతమైన రియాక్షన్ ఇచ్చి చిన్నపాటి డ్యాన్స్ కూడా చేశాడు. కొన్ని రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పటికే 19 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు ఎంతో మంది ఈ వీడియోపై లైక్‌లు, కామెంట్లు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-06-23T20:16:14+05:30 IST