Viral video: పిల్ల కొండముచ్చు కోసం బాలిక పోటాపోటీ.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-08-28T03:02:56+05:30 IST

పిల్లల సంరక్షణ విషయంలో మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎంత ప్రేమ చూపిస్తారో.. అచ్చం జంతువులు కూడా తమ పిల్లలపై అమితమైన ప్రేమను పెంచుకుంటాయి...

Viral video: పిల్ల కొండముచ్చు కోసం బాలిక పోటాపోటీ.. చివరకు ఏమైందంటే..

పిల్లల సంరక్షణ విషయంలో మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎంత ప్రేమ చూపిస్తారో.. అచ్చం జంతువులు కూడా తమ పిల్లలపై అమితమైన ప్రేమను పెంచుకుంటాయి. తమ పిల్లల జోలికి వస్తే.. పెద్దా చిన్నా అని చూడకుండా ఎవరితోనైనా పోటీపడేందుకు వెనుకాడవు. ఇక చింపాంజీలు, కోతులు, కొండముచ్చులు.. తమ పిల్లలను ఎలా చూసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. పిల్ల కొండముచ్చు విషయంలో ఓ బాలిక.. తల్లి కొండముచ్చుతో పోటీ పడింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. ఓ మేడపై చాలా కొండముచ్చులు (langur) ఆహారం తింటూ ఉంటాయి. అక్కడికి వెళ్లిన ఓ చిన్నారి.. తల్లి కొండముచ్చు వద్ద ఉన్న పిల్లను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. బాలికను గమనించిన కొండముచ్చు.. పిల్లను ఒడిలో పెట్టుకుని అటు తిరిగి కూర్చుంటుంది. అయినా వదలని బాలిక.. బలవంతంగా పిల్ల కొండముచ్చును లాక్కుంటుంది. తర్వాత దాన్ని ఎత్తుకుని కొద్ది దూరం వెళ్తుంది. తన పిల్లను తీసుకెళ్లడంతో.. తినే తిండిని పక్కన పడేసి, పరుగెత్తుకుంటూ బాలిక వద్దకు వెళ్తుంది. నా పిల్లను నాకివ్వు.. అంటూ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఏమాత్రం కోపం చూపించకుండా.. సుతిమెత్తగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తుంది. పిల్ల కొండముచ్చు నాదంటే.. నాదంటూ చాలా సేపు ఒకరి వైపు ఇంకొకరు లాక్కుంటారు. చివరకు ఎలాగోలా తన పిల్లను తాను దక్కించుకున్న కొండముచ్చు.. హమ్మయ్య! అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అబ్బా! చేపల వేటకు వెళ్తే.. సీన్ రివర్స్ అయ్యిందే.. నవ్వులు పూయిస్తున్న వీడియో..





Updated Date - 2022-08-28T03:02:56+05:30 IST