Viral funny video: ఏవమ్మా! డాన్స్ వేసేటప్పుడు.. ముందు, వెనుక చూసుకోవాలి కదా.. కాస్తుంటే ఏం జరిగేదో తెలుసా..

ABN , First Publish Date - 2022-09-03T02:40:08+05:30 IST

కొందరు తాము చేసే పనుల్లో లీనమైపోతుంటారు. ఇంకొందరైతే.. పక్కన ఎవరు ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు. తీరా జరగాల్సిన నష్టం జరిగాక.. నాలుక్కరుచుకుంటూ...

Viral funny video: ఏవమ్మా! డాన్స్ వేసేటప్పుడు.. ముందు, వెనుక చూసుకోవాలి కదా.. కాస్తుంటే ఏం జరిగేదో తెలుసా..

కొందరు తాము చేసే పనుల్లో లీనమైపోతుంటారు. ఇంకొందరైతే.. పక్కన ఎవరు ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తుంటారు. తీరా జరగాల్సిన నష్టం జరిగాక.. నాలుక్కరుచుకుంటూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ మహిళ డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. మహిళ డాన్స్ వీడియో వైరల్ (Dance video) అవుతోంది. వేడుక సందర్భంగా కొందరు మహిళలు డీజే పాటలకు స్టెప్పులు వేస్తుంటారు. వారిలో ఓ మహిళ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తుంటుంది. పూర్తిగా పాటలో లీనమవడం వల్ల ముందు, వెనుక ఎవరున్నారనే విషయం కూడా పట్టించుకోదు. ఈ క్రమంలో ఓ బాలుడు అటూ ఇటూ తిరుగుతూ ఆమె వెనుక పక్క నుంచి వెళ్తాడు. అప్పుడే ఆ మహిళ.. డాన్స్ వేస్తూ చూసుకోకుండా ఒక్కసారిగా వెనక్కు వస్తుంది. బాలుడు తగలగానే ఒక్కసారిగా కిందపడిపోతుంది. పక్కన ఉన్న వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను అతి కష్టం మీద పైకి లేపుతారు. బాలుడు కూడా కిందపడడంతో ఏడుపు మొదలెడతాడు. దీంతో పక్కనున్న మహిళ.. పిల్లవాడిని ఎత్తుకుని ఓదారుస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు వివిధ రకాలుగా సూచనలు ఇస్తున్నారు.

భార్య చనిపోయిన నెల తర్వాత వీడియో విడుదల చేసిన భర్త.. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకునే లోపే..





Updated Date - 2022-09-03T02:40:08+05:30 IST