రాజకీయ ఒత్తిళ్లకు బలి

ABN , First Publish Date - 2022-08-08T04:52:10+05:30 IST

దర్శి నియోజకవర్గంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు వరుసగా సస్పెండ్‌ అవుతున్నారు. గత ఏడాదికాలంలో అరడజను మందికి పైగా అధికారులు వారి అనుచిత తీరువలన సస్పెన్షన్‌కు గురయ్యారు. కొందరు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు పనులు చేసి బలి అయ్యారు. మరికొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌ అయ్యారు.

రాజకీయ ఒత్తిళ్లకు బలి

దర్శిలో వరుసగా సస్పెండ్‌ అవుతున్న అధికారులు

అవినీతి అక్రమాలకు పాల్పడి కొందరు... 

ఇష్టానుసారం వ్యవహరించి మరికొందరు..

విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు


దర్శి, ఆగస్టు 7 : దర్శి నియోజకవర్గంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు వరుసగా సస్పెండ్‌ అవుతున్నారు. గత ఏడాదికాలంలో అరడజను మందికి పైగా అధికారులు వారి అనుచిత తీరువలన సస్పెన్షన్‌కు గురయ్యారు. కొందరు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు పనులు చేసి బలి అయ్యారు. మరికొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడి సస్పెండ్‌ అయ్యారు. ఇంకొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరించి చేజేతులా చర్యలకు గురయ్యారు.సస్పెండ్‌ అయిన అధికారుల తీరుపట్ల ప్రజలు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. 


రెవెన్యూ వారే అధికం

ఏడాది కాలంలో సస్పెండ్‌ అయిన అధికారుల్లో రెవెన్యూ వారే అధికంగా ఉన్నారు. ఏడాది క్రితం దర్శిలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న వీడీబీ వరకుమార్‌ కురిచేడు మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో కురిచేడు మండలం పొట్లపాడు రెవెన్యూలోని సుమారు 80 ఎకరాల అసైన్‌మెంట్‌ భూమిని ఇరువురికి ఆన్‌లైన్‌చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు. ఇతరుల పేరుతో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా మార్చి పాసుపుస్తకాలు మంజూరు చేసినందుకు తహసీల్దార్‌ వరకుమార్‌ సస్పెండ్‌ అయ్యారు. అధికార పార్టీకి చెందిన పెద్దల ఒత్తిడికి తలొగ్గి ఆయన అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. ఉన్నతాధికారులు విచారణ చేసి ఆయనకు రివర్షన్‌ ఇచ్చి సీనియర్‌ అసిస్టెంట్‌గా నియమించారు.  ఉద్యోగోన్నతి పొందాల్సిన వ్యక్తి రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి  కిందిస్ధాయి రివర్షన్‌కు రావటం పట్ల ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. 

తాళ్లూరు మండలంలో ఉపాధి పనుల బిల్లుల పంపిణీలో నిబంధనలను అతిక్రమించిన ఇరువురు అధికారులు వేర్వేరుగా నివేదికలు పొంతన లేకుండా పంపటంతో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేస్తున్న రాజేష్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ఇన్‌చార్జి ఏఈ ఆర్‌వీ సుబ్బయ్యను ఉపాధి పనుల బిల్లులకు సంబంధించి అనుచితంగా వ్యవహరించారనే అభియోగంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దొనకొండ మండలం ఈవోఆర్డీగా పనిచేస్తున్న కేజీఎస్‌ రాజు పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు ఆయనను జిల్లా కార్యాలయానికి  సరెండర్‌ చేశారు. కురిచేడు మండలంలో ఎలక్ర్టికల్‌ ఏఈగా పనిచేసిన శ్రీనివాసరావు వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు రావటంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆయన కొందరు రైతులకు మంజూరైన ట్రాన్స్‌ఫార్మర్లను ముడుపులు తీసుకొని వేరే రైతులకు ఇచ్చారనే ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రెవెన్యూలో కీలకమైన ఫైౖలుకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావటంతో కురిచేడు మండలంలో పనిచేస్తున్న వీఆర్వో నాగరాజు సస్పెండయ్యారు. 


అనుమతి లేకుండా బ్యాంకాక్‌ వెళ్లిన ఇద్దరిపై వేటు

తాజాగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా సాధారణ సెలవుపై బ్యాంకాక్‌ విహారయాత్రకు వెళ్లిన దర్శి ఎస్సై ఎ. చంద్రశేఖర్‌ను ఎస్పీ మలికగర్గ్‌ కొద్దిరోజుల క్రితం సస్పెండ్‌ చేశారు. అదేవిదంగా దర్శి డిప్యూటీ తహసీల్దార్‌ రవిశంకర్‌ అనుమతి లేకుండా విహార యాత్రకు బ్యాంకాక్‌ వెళ్లినందుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.  ఇటీవల ఉన్నతాధికారులు ఆయన్ను కూడా సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్సై, డీటీలు  వైసీపీ నాయకులు, రేషన్‌ బియ్యం వ్యాపారులతో కలిసి విహారయాత్రకు వెళ్లటం దర్శి ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పుచేసిన అధికారులు ఎప్పటికైనా ఫలితం అనుభవించాల్సిందేనని ప్రజలు ఆయా అధికారుల తీరుపట్ల తీవ్రంగా చర్చించుకుంటున్నారు.


అనుమతి లేకుండా బ్యాంకాక్‌ వెళ్లిన ఇద్దరిపై వేటు

తాజాగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా సాధారణ సెలవుపై బ్యాంకాక్‌ విహారయాత్రకు వెళ్లిన దర్శి ఎస్సై ఎ. చంద్రశేఖర్‌ను ఎస్పీ మల్లికాగర్గ్‌ కొద్దిరోజుల క్రితం సస్పెండ్‌ చేశారు. అదేవిదంగా దర్శి డిప్యూటీ తహసీల్దార్‌  రవిశంకర్‌ అనుమతి లేకుండా విహార యాత్రకు బ్యాంకాక్‌ వెళ్లినందుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. శనివారం ఉన్నతాధికారులు ఆయన్ను కూడా సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్సై, డీటీలు  వైసీపీ నాయకులు, రేషన్‌ బియ్యం వ్యాపారులతో కలిసి విహారయాత్రకు వెళ్లటం దర్శి ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పుచేసిన అధికారులు ఎప్పటికైనా ఫలితం అనుభవించాల్సిందేనని ప్రజలు ఆయా అధికారుల తీరుపట్ల తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

 

Updated Date - 2022-08-08T04:52:10+05:30 IST