వైరస్‌ వ్యాప్తికి ఊతమిచ్చే ‘వెంటిలేషన్‌ వ్యవస్థ’

ABN , First Publish Date - 2020-10-01T09:14:52+05:30 IST

వెంటిలేషన్‌ వ్యవస్థలతో చలికాలంలో కరోనా ఇన్ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉంటుందని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు...

వైరస్‌ వ్యాప్తికి ఊతమిచ్చే ‘వెంటిలేషన్‌ వ్యవస్థ’

లండన్‌, సెప్టెంబరు 30: భవనాల్లోని ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడానికి వాడే వెంటిలేషన్‌ వ్యవస్థలతో చలికాలంలో కరోనా ఇన్ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉంటుందని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవనంలోని అన్ని గదుల్లో ఒకే తరహాలో గాలి, వెలుతురు ప్రసరింపజేసే ‘మిక్సింగ్‌ వెంటిలేషన్‌’ వ్యవస్థల కారణంగా.. ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే నీటితుంపరలు అంతటా అతి సునాయాసంగా వ్యాపించగలుగుతాయని తెలిపారు. వైర్‌సతో కూడిన నీటితుంపరలు.. శ్వాసక్రియలో భాగంగా మనుషులు వదిలే కార్బన్‌ డయాక్సైడ్‌తో కలిసి వెంటిలేషన్‌ ద్వారా వచ్చే గాలిని వాహకంగా వాడుకొని భవనమంతా ప్రయాణిస్తాయన్నారు. ఈనేపథ్యంలో మూడు లేయర్ల మాస్క్‌ల వాడకం ద్వారా ఇన్ఫెక్షన్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. 

Updated Date - 2020-10-01T09:14:52+05:30 IST