తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న మిడతల దండు

ABN , First Publish Date - 2020-05-28T19:47:19+05:30 IST

దేశంపై మిడతల దండయాత్ర కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తున్న మిడతల దండు

హైదరాబాద్: దేశంపై మిడతల దండయాత్ర కొనసాగుతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రను దాటి తెలుగు రాష్ట్రాలవైపు దూసుకువస్తున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన మొదలైంది. మిడతల దండు మహారాష్ట్రలోని అమరావతి వరకూ చేరుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. అమరావతిలో అదుపు కాని పక్షంలో.. త్వరలోనే రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం కావాలని సూచించారు. సస్యరక్షణ రసాయన మందులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-28T19:47:19+05:30 IST