TS News: బస్సుపై కూలిన చెట్టు... తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-11T15:26:07+05:30 IST

నగరంలోని నాచారంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

TS News: బస్సుపై కూలిన చెట్టు... తప్పిన ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని నాచారంలో ఆర్టీసీ బస్సు (RTC bus)కు పెను ప్రమాదం తప్పింది. ఈసీఐఎల్ నుంచి అప్జల్‌గంజ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద అకస్మాత్తుగా భారీ వృక్షం (Heavy tree) కూలింది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అక్కడకు చేరుకుని పోలీసులు వృక్షాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2022-08-11T15:26:07+05:30 IST