ఉచ్చు బిగించే కుట్ర: Ayodhya పర్యటన వాయిదాపై Raj Thackeray

ABN , First Publish Date - 2022-05-22T21:43:10+05:30 IST

తన అయోధ్య(Ayodhya) పర్యటన వాయిదా వేసుకోవడం పట్ల మహారాష్ట్ర నవనిర్మాణ సేన(Maharashtra Navnirman Sena) అధినేత రాజ్ థాకరే(Raj Thackeray) స్పష్టతనిచ్చారు. తనను వ్యతిరేకించే కొందరు.. తనను తప్పుడుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయోధ్య పర్యటనను అందుకు అవకాశంగా తీసుకుంటున్నారని..

ఉచ్చు బిగించే కుట్ర: Ayodhya పర్యటన వాయిదాపై Raj Thackeray

ముంబై: తన అయోధ్య(Ayodhya) పర్యటన వాయిదా వేసుకోవడం పట్ల మహారాష్ట్ర నవనిర్మాణ సేన(Maharashtra Navnirman Sena) అధినేత రాజ్ థాకరే(Raj Thackeray) స్పష్టతనిచ్చారు. తనను వ్యతిరేకించే కొందరు.. తనను తప్పుడుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయోధ్య పర్యటనను అందుకు అవకాశంగా తీసుకుంటున్నారని, అందుకే తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. దీనికి రెండు రోజుల ముందే పర్యటన వాయిదా గురించి చెప్పినప్పటికీ అందుకు గల కారణాన్ని వెల్లడించలేదు. ముందుగా చెప్పినట్టే ఆదివారం పూణెలో నిర్వహించిన సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘అయోధ్య పర్యటనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేను ట్వీట్ చేశాను. అయితే ఈ నిర్ణయం చాలా మందికి నచ్చలేదు. నేనెందుకు పర్యటన వాయిదా వేసుకోవాలని కొందరు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే మహారాష్ట్రకైనా దేశానికైనా నా వైఖరిని స్పష్టం చేయాలని అనుకున్నాను. ముందుగా నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారితో మాట్లాడడానికి రెండు రోజుల సమయం తీసుకున్నాను. వారితో మాట్లాడితన తర్వాతే వాయిదా గురించి ప్రజలకు చెప్పాలని అనుకున్నాను’’ అని రాజ్ థాకరే అన్నారు.

Updated Date - 2022-05-22T21:43:10+05:30 IST