పక్కన కూర్చున్న మహిళలను చూస్తూ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తున్నారని.. ఉగాండా ట్రేడర్స్ అసోషియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే..

ABN , First Publish Date - 2022-01-30T20:11:22+05:30 IST

సరుకు రవాణా చేసే ట్రక్కుల ఫ్రంట్ క్యాబిన్లలో ఇకపై మహిళలు కూర్చోకూడదని ఉత్తర ఉగాండా ట్రేడర్స్ అసోషియేషన్ నిషేధం విధించింది.

పక్కన కూర్చున్న మహిళలను చూస్తూ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తున్నారని.. ఉగాండా ట్రేడర్స్ అసోషియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే..

సరుకు రవాణా చేసే ట్రక్కుల ఫ్రంట్ క్యాబిన్లలో ఇకపై మహిళలు కూర్చోకూడదని ఉత్తర ఉగాండా ట్రేడర్స్ అసోషియేషన్ నిషేధం విధించింది. తమ పక్కన చిన్న స్కర్టులు ధరించి కూర్చున్న మహిళల తొడలు చూస్తూ డ్రైవర్లు యాక్సిడెంట్లు చేస్తున్నారని, ఇటీవలి కాలంలో అలాంటి కేసులు పెరిగిపోయాయని ఉత్తర ఉగాండా ట్రేడర్స్ అసోషియేషన్ గుర్తించింది. దీంతో ఇకపై లారీల, ట్రక్కుల ఫ్రంట్ క్యాబిన్లలో డ్రైవర్ల పక్కన మహిళలు కూర్చోకూడదని నిషేధం విధించింది. 


లీరా మార్కెట్‌కు ఈ నెల పదో తేదీన వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో పది మంది వ్యాపారులు మరణించారు. 20 మంది గాయపడ్డారు. పక్కన షార్ట్ డ్రెస్‌లో కూర్చున్న మహిళను చూస్తూ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాడని విచారణలో తేలింది. దీంతో ఈ బ్యాన్ అమల్లోకి వచ్చింది. `అతివేగం, మద్యపానంతో పాటు పక్కన కూర్చున్న మహిళా కూలీల పట్ల ఆకర్షితులవుతున్న డ్రైవర్ల వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంత మంది మహిళలు డ్రైవర్లకు బలవంతంగా మద్యం కూడా ఇస్తున్నారు. షార్ట్ డ్రెస్‌లు ధరించి డ్రైవర్ల ఏకాగ్రతను దెబ్బతీసున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామ`ని లీరా మొబైల్ మార్కెట్ వెండార్ గ్రూప్ చైర్మెన్ పాట్రిక్ తెలిపారు. 


ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. మహిళలపై ఇది మరో వివక్ష అని మహిళా కార్యకర్త ముగ్‌వన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషాధిక్యతకు, మహిళలపై వివక్షకు ఈ నిర్ణయం పరాకాష్టగా నిలుస్తుందన్నారు. ఇది ఉగాండా రాజ్యంగా స్ఫూర్తికే విరుద్ధమని, పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా రోజువారి పనులను స్వేచ్ఛగా చేసుకునే హక్కు ఉందని చెప్పారు. 

Updated Date - 2022-01-30T20:11:22+05:30 IST