మామిడి రైతుకు కలసిరాని కాలం

ABN , First Publish Date - 2022-04-24T04:04:42+05:30 IST

మామిడి రైతును దురదృష్టం వెంటాడుతున్నది. ఈయేడు ప్రతికూల వాతావరణం తో దిగుబడి తగ్గిపోయింది. సాధారణ దిగుబడులతో పోల్చితే 20 శాతం కూడా కాత లేదు. జిల్లాలో 22 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 3 టన్నుల వరకు రావాల్సిన దిగుబడి ప్రస్తుతం అర టన్ను కూడా రావడం కష్టమని రైతులంటున్నారు. లక్షల రూపా యలు ఖర్చు చేసినా పెట్టుబడి కూడా చేతికి రాదని రైతులు వాపోతున్నారు.

మామిడి రైతుకు కలసిరాని కాలం
కాయలు లేని చెట్లను చూపుతున్న రైతు

ప్రతికూల వాతావరణంతో ఈ సారి నిరాశే

ఎకరానికి టన్ను దిగుబడి గగనం 

ఆదుకోవాలని వేడుకుంటున్న అన్నదాతలు

నెన్నెల, ఏప్రిల్‌ 23: మామిడి రైతును దురదృష్టం వెంటాడుతున్నది. ఈయేడు ప్రతికూల వాతావరణం తో దిగుబడి తగ్గిపోయింది.  సాధారణ దిగుబడులతో పోల్చితే  20 శాతం కూడా కాత లేదు. జిల్లాలో 22 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 3 టన్నుల వరకు రావాల్సిన దిగుబడి ప్రస్తుతం అర టన్ను కూడా రావడం కష్టమని రైతులంటున్నారు. లక్షల రూపా యలు ఖర్చు చేసినా పెట్టుబడి కూడా చేతికి రాదని రైతులు వాపోతున్నారు. వాతావరణ ఆధారిత బీమా ఉన్నప్పటికి రైతులకు అవగాహన లేక నష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. తోటలు లీజుకు తీసుకున్న గుత్తేదారులు, వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిచూసి  లబోదిబోమంటున్నారు. 

ప్రారంభమైన కోతలు

మామిడి కోతల సీజన్‌ ప్రారంభమైంది. రైతులు కాయలను మార్కెట్‌కు తరలిస్తున్నారు. ధర ఆశాజన కంగానే ఉంది. మహారాష్ట్రలోని నాగపూర్‌ మార్కెట్లో ప్రస్తుతం బంగినపల్లి రకం కాయ టన్నుకు రూ.70 వేల నుంచి రూ.80 వేలు, ఇతర రకాలు రూ.45 వేల వరకు  పలుకుతోంది.  గత సంవత్సరం కన్న రెట్టిం పు ధర ఉన్నప్పటికీ లాభం లేదని, చేతికి వస్తున్న అంతంత మాత్రపు దిగుబడితో నష్టాన్ని పూడ్చుకో వడం కష్టమని రైతులు వాపోతున్నారు. 

ప్రతికూల వాతావరణమే కారణం 

వాతావరణ మార్పుల ప్రభావంతో మామిడి దిగు బడులపై ప్రతికూల ప్రభావం చూపినట్టు ఉద్యాన శాఖ  అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలు కురవడం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఫిబ్రవరి చివరివారం నుంచే ఎండల తీవ్రత మామి డి దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయని అధికా రులంటున్నారు.  జనవరి ఆఖరు నాటికి చెట్లు పూతతో కళకళలాడుతుంటాయి. అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు తేమ అధికమైంది. పొడి వాతావరణం లేక పోవడంతో చెట్లు పూతకు రాలేదు. ఆలస్యంగా వచ్చిన పూత చీడపీడల కారణంగా పిందెకట్టకుండానే రాలిపోయింది.  

ఒక్క చెట్టు కూడా కాయలేదు

-పాపిరెడ్డి,  నెన్నెల

నాలుగెకరాల మామిడి తోట ఉంది. అందులో ఒక్క చెట్టు కూడా కాయ లేదు.  యేటా పెట్టుబడి పోను లక్ష రూపా యల వరకు ఫలసాయం వచ్చేది.  ఈ సారి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రావు. కాయలు లేక తోటకు కావలి పెట్ట లేదు.  ప్రభుత్వం ఆదుకోవాలి.

రెండేళ్లు కరోనాతో నష్టం...  

ఓరగంటి బాపు  రైతు

రెండేళ్లు కరోనా కారణంగా పంటను ఎక్కడికి తరలించుకో లేక నష్టపోయాం. ఈ ఏడు ధర ఉంది కాని దిగుబడి లేదు. ఎకరం తోటంతా వెతికితే అర టన్ను కాయలు  చేతికొస్తాయి. నాలుగేళ్లుగా  నష్టపో తూనే ఉన్నాం. 

 

Updated Date - 2022-04-24T04:04:42+05:30 IST