తిరుపతిలో మళ్లీ వెయ్యి కేసులు

ABN , First Publish Date - 2021-04-30T06:06:48+05:30 IST

జిల్లాలో గడచిన 24 గంటల్లో మరో 1831 మందికి కరోనా వైరస్‌ సోకింది. అదే సమయంలో వైరస్‌ బారిన పడి ఐదుగురు మృతిచెందారు.

తిరుపతిలో మళ్లీ వెయ్యి కేసులు

జిల్లావ్యాప్తంగా మరో 1831మందికి కరోనా

 ఐదుగురు మృతి

15 వేలు దాటేసిన యాక్టివ్‌ పాజిటివ్‌లు


తిరుపతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడచిన 24 గంటల్లో మరో 1831 మందికి కరోనా వైరస్‌ సోకింది. అదే సమయంలో వైరస్‌ బారిన పడి ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులు, మరణాలతో జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 116620కి, మరణాల సంఖ్య 970కి చేరుకున్నాయి. మరోవైపు గురువారం ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 15 వేలు దాటేశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా 15158కి చేరాయి. కొత్తగా నమోదైన 1831 పాజిటివ్‌ కేసుల్లో తిరుపతి అర్బన్‌, రూరల్‌ మండలాల్లోనే 1022 కేసులుండడం గమనార్హం. తాజా కేసుల్లో తిరుపతి నగరంలోనే 842, తిరుపతి రూరల్‌లో 182, ఏర్పేడులో 72, చిత్తూరులో 60, మదనపల్లె, శ్రీకాళహస్తి మండలాల్లో 46 వంతున వెలుగు చూశాయి.కుప్పంలో 43, రేణిగుంటలో 38, చౌడేపల్లెలో 29, పుంగనూరులో 28, కలికిరిలో 26, తవణంపల్లెలో 23, చంద్రగిరిలో 22, వడమాలపేట, వాల్మీకిపురం మండలాల్లో 21 వంతున, పలమనేరు, పులిచెర్ల మండలాల్లో 19 వంతున, గుడుపల్లెలో 17, పెనుమూరులో 16, గంగవరం, పీలేరు, పుత్తూరు, రామకుప్పం మండలాల్లో 15 వంతున, కార్వేటినగరంలో 14, శాంతిపురంలో 13, పాకాల, రొంపిచెర్ల మండలాల్లో 12 వంతున, చిన్నగొట్టిగల్లులో 11, వి.కోటలో 10, ములకలచెరువు,పెద్దమండ్యం, సదుం, ఎర్రావారిపాలెం మండలాల్లో 9 వంతున, బైరెడ్డిపల్లె, కేవీబీపురం మండలాల్లో 8 వంతున, ఐరాలలో 7, బంగారుపాలెం, సోమల మండలాల్లో 6 వంతున, నగరి, రామచంద్రాపురం మండలాల్లో 5 వంతున, కేవీపల్లె, పీటీఎం, పెద్దపంజాణి, తొట్టంబేడు, వెదురుకుప్పం మండలాల్లో 4 వంతున, జీడీనెల్లూరు, నిమ్మనపల్లె, యాదమరి మండలాల్లో 3 వంతున, కలకడ, నారాయణవనం, పూతలపట్టు, తంబళ్లపల్లె మండలాల్లో 2 వంతున, బి.కొత్తకోట, బీఎన్‌ కండ్రిగ, గుర్రంకొండ, కురబలకోట, నిండ్ర, పాలసముద్రం, సత్యవేడు, శ్రీరంగరాజపురం, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

ప్రభుత్వ కొవిడ్‌ సెంటర్లలో 531 పడకల ఖాళీ 

తిరుపతిలోని ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లలో గురువారం రాత్రి 10  గంటలకు  831పడకలు ఖాళీగా ఉన్నాయి.విష్ణునివాసంలో 280  బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.  రుయాలో 185 ఖాళీ వుండగా వాటిలో ఐసీయూ5, ఆక్సిజన్‌ 34, నాన్‌ ఆక్సిజన్‌ 146 ఖాళీగా ఉన్నాయి.   శ్రీనివాసంలో  240 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి.   టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాధవంలో 70 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. ఆయుర్వేద వైద్యశాలలో 56 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2021-04-30T06:06:48+05:30 IST