న్యూయార్క్ గవర్నర్‌పై మరో మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు!

ABN , First Publish Date - 2021-03-02T22:06:12+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోపై మరో మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

న్యూయార్క్ గవర్నర్‌పై మరో మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు!

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోపై మరో మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇప్పటికే క్యూమోపై మాజీ మహిళా ఉద్యోగులైన లిండ్సే బోయ్లాన్, షార్లెట్ బెన్నెట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా.. తాజాగా ఈ జాబితాలో అన్నా రూచ్ అనే మహిళ చేరింది. 2019 సెప్టెంబర్‌లో ఓ వెడ్డింగ్ పార్టీలో క్యూమోను కలిసినట్లు ఆమె పేర్కొంది. ఆ సమయంలో తనపై వేయకూడని చోట ఆయన చేయి వేశారని.. ఆ తర్వాత తనను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగినట్లు రూచ్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో తెలిపింది. ఆ సమయంలో క్యూమో చర్య, మాటలు తనను షాక్ గురి చేశాయని చెప్పింది. తనకు అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు రూచ్ చెప్పుకొచ్చింది. 


ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోను సైతం ఆమె బయటపెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, రూచ్ ఆరోపణలపై క్యూమో కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక ఇంతకుముందు 25 ఏళ్ల మాజీ ఆరోగ్య సలహాదారు షార్లెట్ బెన్నెట్ కూడా గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈమెతో పాటు మరో మాజీ సలహాదారు 36 ఏళ్ల లిండ్సే బోయ్లాన్ కూడా ఆయనపై ఇవే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ఆరోపణలను ఖండించిన గవర్నర్ కార్యాలయం.. రూచ్ ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం.   



Updated Date - 2021-03-02T22:06:12+05:30 IST