సాంబ్రాణి వేయడానికి వచ్చి సైలెంట్‌గా దొంగతనం

ABN , First Publish Date - 2020-09-24T23:31:55+05:30 IST

ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. ఫకీర్ వేషంలో వచ్చిన దొంగ ఓ ఇంట్లో సెల్‌ఫోన్ అపహరించాడు. ...

సాంబ్రాణి వేయడానికి వచ్చి సైలెంట్‌గా దొంగతనం

హైదరాబాద్: ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. ఫకీర్ వేషంలో వచ్చిన దొంగ ఓ ఇంట్లో సెల్‌ఫోన్ అపహరించాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్సార్‌నగర్ పీఎస్ పరిధిలోని కల్యాణ్ నగర్ వెంచర్-3లో ఈ చోరీ జరిగింది. ఫకీర్ వేషంలో వచ్చిన దొంగ ఇంటి హాల్లో ఎవరూ లేరని గ్రహించిన దొంగ.. టేబుల్‌పై ఉన్న సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. పక్కన కిచెన్‌లో ఉన్న వాళ్లు ఈ చోరీని గమనించలేదు. సైలెంట్‌గా వచ్చిన దొంగ ఖరీదైన సెల్‌ఫోన్‌ను జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. కాసేపు తర్వాత సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్లంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను చెక్ చేశారు. సినిమాలో చూపించినట్టుగానే పక్క గదిలో మనుషులు ఉన్నా సైలెంట్‌గా దొంగ తన పని తాను చేసుకుని వెళ్లిపోవడం చూసి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 

Updated Date - 2020-09-24T23:31:55+05:30 IST