తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2021-06-22T05:40:50+05:30 IST

స్థానిక జమ్మలమడుగు రోడ్డులోని పాతబస్టాండు సమీపాన మలుపులోని ఇంటిలోకి సిమెంట్‌ ట్యాంకర్‌ సోమవారం రాత్రి 9గంటల సమయంలో దూసు కెళ్లింది.

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
ఇంటిలోకి దూసుకెళ్లి బోల్తా పడిన ట్యాంకర్‌

ముద్దనూరు, జూన్‌ 21 : స్థానిక జమ్మలమడుగు రోడ్డులోని పాతబస్టాండు సమీపాన మలుపులోని ఇంటిలోకి సిమెంట్‌ ట్యాంకర్‌  సోమవారం రాత్రి 9గంటల సమయంలో దూసు కెళ్లింది. అయితే ఆ సమయంలో ఇంటిలో ఎవ్వరూ లేక పోవడంతో  ఘోర ప్రమాదం తప్పింది. వివరాల్లోకివెలితే..  సిమెంట్‌ ట్యాంకర్‌ రోడ్డు మలుపులోని చలపతిరావు ఇంటిలోకి  దూసుకెళ్లి బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో ఇంటి ముందు ఉన్న మెట్లు, సన్‌సైడ్‌ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఆ సమయంలో ఇంటిలో ఉన్నవారు మిద్దెపై పడుకుని ఉండడం తో ప్రాణాపాయాం తప్పింది. డ్రైవర్‌ సురక్షితంగా బయట పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే ప్రమాద స్థలాన్ని సీఐ హరినాథ్‌ పరిశీలించారు. కాగా గతేడాది నవంబరు ఇదే ఇంటి పక్కన ఉన్న ఇంటిలోకి సిమెంట్‌ లారీ దూసుకెళ్లడంతో డ్రైవర్‌ మృతి చెందగా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-22T05:40:50+05:30 IST