భాగ్యనగరంలో బద్రీనాథ్.... ఉత్తరాఖండ్‌వాసుల చొరవ!

ABN , First Publish Date - 2020-09-29T16:13:23+05:30 IST

ఉత్తరాఖండ్‌వాసులకు బద్రీనాథ్ ఆరాధ్యదైవం. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఉత్తరాఖండ్‌కు చెందిన సుమారు 6 వేల మంది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంటున్నారు.

భాగ్యనగరంలో బద్రీనాథ్.... ఉత్తరాఖండ్‌వాసుల చొరవ!

హైదరాబాద్: ఉత్తరాఖండ్‌వాసులకు బద్రీనాథ్ ఆరాధ్యదైవం. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఉత్తరాఖండ్‌కు చెందిన సుమారు 6 వేల మంది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరంతా తరచూ బద్రీనాథ్ వెళ్లి స్వామివారిని దర్శించుకుని వస్తుంటారు. ఈ నేపధ్యంలోనే వీరంతా సుమారు రూ. 60 లక్షల వ్యయంతో హైదరాబాద్‌లో బద్రీనాథ్ మందిరాన్ని నిర్మిస్తున్నారు.



ఫలితంగా తాము తరచూ బద్రీనాథ్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే స్వామివారిని దర్శించుకోవచ్చని భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ కల్యాణ్ కారీ ‌సంస్థ మందిర నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు విక్రమ్ సింగ్ ఉనాల్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో ఈ ఆలయాన్నినిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 80 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇదే ఏడాది మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించామని, అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా పనులు ఆగిపోయాయన్నారు. ఇప్పుడు తిరిగి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు.


2021 ప్రారంభం నాటికల్లా ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. కాగా ఈ మందిరాన్ని రెండస్థులలో నిర్మిస్తున్నారు. ఆలయంలో 350 మంది కూర్చునేందుకు వీలుగా పెద్ద హాలు నిర్మిస్తున్నారు. ఆలయంలో పలు దేవత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటినీ భాగ్యనగరంలో నిర్మించబోయే ఆలయంలో కూడా నిర్వహించనున్నారు. 

Updated Date - 2020-09-29T16:13:23+05:30 IST