విదేశాల నుంచి వచ్చి... కరోనా బాధితుల సేవలో తెలుగోడు...

ABN , First Publish Date - 2021-05-13T19:55:17+05:30 IST

విదేశాల్లో చదువుకున్నాడు. అక్కడే పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అయినా సొంత భూమిపై మమకారాన్ని ఏమాత్రం చంపుకోలేకపోయాడు. తనవారికి, తన నేలకు ఎంతోకొంత సేవ చేయాలన్న తపన... ఆయనను మళ్ళీ స్వదేశానికి రప్పించేలా చేసింది. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఆ యువకుడి వితరణకు సంబంధించిన కథనమిది...

విదేశాల నుంచి వచ్చి... కరోనా బాధితుల సేవలో తెలుగోడు...

హైదరాబాద్ : విదేశాల్లో చదువుకున్నాడు. అక్కడే పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అయినా సొంత భూమిపై మమకారాన్ని ఏమాత్రం చంపుకోలేకపోయాడు. తనవారికి, తన నేలకు ఎంతోకొంత సేవ చేయాలన్న తపన... ఆయనను మళ్ళీ స్వదేశానికి రప్పించేలా చేసింది. ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన ఆ యువకుడి వితరణకు సంబంధించిన కథనమిది... కామారెడ్డి జిల్లా బికునూర్ గ్రామానికి చెందిన సరికొండ భూంరెడ్డి, వననజల కుమారుడైన డాక్టర్ వినయ్‌కుమార్ రెడ్డి(ఎస్వీఆర్)... ఉన్నతవిభ్యనభ్యసించేందుకు 2007 లో అమెరికా వెళ్ళాడు. ఆ తర్వాత... అక్కడే ఎన్నో ఉన్నతోద్యోగాలు చేశాడు.


దానికితోడు మరెన్నో బహుళజాతి సంస్థల్లో అతనికి అవకాశాలొచ్చాయి. అమెరికాలోనే కాకుండా, మరెన్నో ఇతర దేశాల్లో కూడా ఉన్నతోద్యోగావకాశాలొచ్చాయి. పలు సంస్థలు అతనికి రూ. 30 లక్షల వేతనాన్నందిస్తాయని కూడా ప్రకటించాయి. అయితే... వీటన్నింటినీ కాదనుకుని, స్వదేశంపై మమకారంతో 2013 లో భారత్‌కు తిరిగొచ్చాడు. ఇక అప్పటినుంచి వినయ్‌కుమార్ రెడ్డి సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక తాజా విషయానికొస్తే... కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో ‘ఎస్వీఆర్ ఆరోగ్యరక్షణ’ పేరుతో కిట్లను రూపొందించి వెనుకబడిన ప్రాంతాల్లోని పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఇందుకుగాను... తన స్నేహితులతో కలిసి పెద్దసంఖ్యలో బృందాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడీ బృందాలన్నీ కరోనా రోగులకు తమ సేవలనందిస్తున్నాయి.


ఈ క్రమంలో వినయ్‌కుమార్ రెడ్డి... గత రెండు సంవత్సరాలుగా దాదాపు పాతికవేలకుపైగా ఈ కిట్లను పంపిణీ చేయడం విశేషం. ఇదిలా ఉంటే స్వతాహాగా రామశక్తుడైన వినయ్... బీజేపీవేపు ఆకర్షితుడై, ఆ పార్టీ నాయకునిగా కూడా గుర్తింపును పొందారు. ప్రస్తుతం... శ్రీ రామ జన్మభూమి రామమందిర నిర్మాణ ట్రస్ట్ న్యాస్ జాతీయ చీఫ్ ఆర్గనైజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 


ఇప్పటికే ఆయన నాలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ కిట్లను పంపిణీ చేశాడు. ఈ క్రమంలో సొంత డబ్బుతోపాటు విరాళాల రూపేణా సేకరించిన సాయాన్ని కూడా అందుకోసం వ్యయం చేయడం గమనార్హం. కాగా ఆయా ప్రాంతాల్లోని ఎనిమిది వేల కుటుంబాలకు పైగా ఎస్ వి ఆర్ ఆరోగ్య రక్షణ కిట్‌లను వినయ్‌కుమార్ రెడ్డి బృందం అందించిది. ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీలు, దళిత కుటుంబాలకే ఈ కిట్ల పంపిణీ జరిగింది. వాషబుల్ మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్ లు, విటమన్ సీ టాబ్లెట్‌‌లతోపాటు మరికొన్ని మందుల పంపిణీ ఈ క్రమంలో జరిగింది.  మొత్తంమీద విదేశాల నుంచి తిరిగొచ్చి, ప్రజారోగ్య పరిరక్షణలో పాలుపంచుకుంటున్న వినయ్‌కుమార్ రెడ్డి... ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడన్న ప్రశంసలనందుకుంటున్నాడు. 

Updated Date - 2021-05-13T19:55:17+05:30 IST