Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

12ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఒంటరిగా Canada వెళ్లేందుకు సిద్ధమైన భార్య.. దీంతో 6ఏళ్ల కూతురితో సహా అతడు..

twitter-iconwatsapp-iconfb-icon
12ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఒంటరిగా Canada వెళ్లేందుకు సిద్ధమైన భార్య.. దీంతో 6ఏళ్ల కూతురితో సహా అతడు..

యాదాద్రి రూరల్‌/చందానగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల కుమార్తెతో కలిసి యాదాద్రికి వచ్చి లాడ్జిలో దిగాడో వ్యక్తి. బిడ్డతో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు. కుమార్తెకి బిర్యానీ తినిపించి, బొమ్మలు ఇప్పించాడు. రాత్రి ఇద్దరూ నిద్రపోయారు. అర్ధరాత్రి నిద్రలేచిన ఆ వ్యక్తి, నిద్రపోతున్న బిడ్డను ఎత్తుకొని లాడ్జి మూడో అంతస్తుపై నుంచి చిన్నారితో సహా కిందికి దూకాడు. ఈ ఘటనలో నగరంలోని చందానగర్‌కు చెందిన చెరుకు సరేష్‌(40), ఆయన కుమార్తె శ్రేష్ట(6) అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు సూసైడ్‌ నోట్‌లో సురేశ్‌ రాశారు. హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన చెరుకు సురేశ్‌ బీఎ్‌సఎన్‌ఎల్‌ సంస్థలో పనిచేస్తున్నారు. 12ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన నాగలక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త, కుమార్తెను ఇక్కడే వదిలేసి తాను కెనడా వెళ్లేందుకు నాగలక్ష్మి యోచిస్తోంది. ఈ విషయంలో సరేష్‌, ఆమెకు ఏడాదిగా గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కుమార్తె శ్రేష్టను సురేశ్‌ వెంటబెట్టుకొని యాదాద్రికి వచ్చారు. పట్టణంలోని మయూరి లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. కొండపైకి వెళ్లి దర్శనం ముగించుకొని.. శ్రేష్టకు బొమ్మలు ఇప్పించి లాడ్జికి తిరిగి వచ్చారు. 


మధ్యాహ్నం హోటల్‌ నుంచి బిర్యానీ తెచ్చుకుని కూతురితో కలిసి తిన్నారు. సాయంత్రం వరకు తన కుమార్తెను బొమ్మలతో ఆడించారు. రాత్రి పొద్దుపోయాక మళ్లీ బిర్యాన్ని తెచ్చుకుని ఇద్దరూ తిన్నారు. రాత్రి 12:45 గంటలకు నిద్రపోతున్న శ్రేష్టను ఎత్తుకొని లాడ్జి మూడో అంతస్తుకు చేరుకొని కిందకు దూకారు. ఇద్దరూ నేరుగా విద్యుత్తు వైర్ల మీద పడటంతో పెద్ద శబ్దంతో సరఫరా నిలిచిపోయింది. లాడ్జి సిబ్బంది వచ్చి చూసేసరికే తండ్రి, కూతురు మృతిచెందారు. పోలీసులొచ్చి లాడ్జి గదిలో పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. సురేశ్‌ తండ్రి ప్రసాదరావు, భార్య నాగలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రసాదరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తాను చనిపోతే కూతురు ఏమవుతుందో అన్న బెంగతోనే బిడ్డతో కలిసి ప్రాణం తీసుకున్నా రని బంధువులు చెబుతున్నారు. తండ్రి కుమార్తె మాత్రమే యాదాద్రికి ఎందుకు వెళ్లారు..? నాగలక్ష్మి వారితో ఎందుకు వెళ్లలేదు..? గురువారం సురేష్‌ గుట్టకు వెళ్లక ముందు ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది.



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.