Advertisement
Advertisement
Abn logo
Advertisement

19 ఏళ్ల యువతి.. సిటీలో చదువుకుంటూ జాబ్ చేస్తోందని ప్రశంసలు.. సడన్‌గా సొంతూరికి వచ్చి ఆమె చేసిన పనికి అంతా విస్మయం..!

ఇంటర్నెట్ డెస్క్: 19 ఏళ్ల యువతి సిటీలో ఉంటూ చదువుకుంటూనే జాబ్ చేస్తోంది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కూతురి గురించి నలుగురికీ చెప్పుకుని మురిసిపోయారు. ఆ యువతి గురించి తెలుసుకున్న చుట్టపక్కల వాళ్లు కూడా ఆమెపై ప్రశంసలు కురింపిచారు. అంతేకాకుండా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని తమ పిల్లలకు చెప్పడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ రోజు ఆ యువతి సొంతూరికి వచ్చింది. అనంతరం ఆమె చేసిన పనికి ఆమె కుటంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాగా.. ఆ యువతి చేసిన పని ఏంటనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌‌లోని హోషంగాబాద్‌కు చెందిన 19ఏళ్ల యువతి దగ్గరలోని సిటీలో ఉండుకుంటూ చదువుకుంటోంది. చేతి ఖర్చుల కోసం ఇంట్లో వాళ్లపై ఆధారపడటం ఇష్టం లేక సిటీలోనే ఆమె పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు మురిసిపోయారు. కూతురు గురించి నలుగురికీ చెప్పుకుని గర్వపడ్డారు. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్లు కూడా సదరు యువతిపై ప్రశంసలు కురింపిచారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం చెప్పాపెట్టకుండా సొంతూరికి వచ్చిన ఆ యువతి.. సరాసరి గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఈ క్రమంలో ప్రయాణం చేసి, అలసి పోయినందువల్ల రెస్ట్ తీసుకుంటుందేమో అని కుటుంబ సభ్యుల భావించారు. సాయంత్రం అయినప్పటికీ సదరు యువతి తలుపులు తీయకపోవడంతో.. కుటుంబ సభ్యులు తలుపుతట్టారు.కూతురు దగ్గర నుంచి ఉలుకూ పలుకూ రాకపోవడంతో భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే గది తలుపులను బద్దలు కొట్టారు. అనంతరం గదిలో కనిపించిన దృశ్యాలను చూసి కంగుతిన్నారు. కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో షాకయ్యారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లవ్ ఎఫైర్ కారణంగా యువతి ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement