ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతి వింత నిర్వాకం.. ఎవరూ లేని సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిచి..

ABN , First Publish Date - 2021-10-08T23:02:09+05:30 IST

ప్రేమించడం ఒక ఎత్తు అయితే ఆ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించడం ఇంకొక ఎత్తు అవుతుంది. అయితే తల్లితండ్రుల్ని ఒప్పించడానికి పిల్లలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసినప్పటికీ కొందరు ఒప్పుకోరు. అలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో జరిగింది.

ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతి వింత నిర్వాకం.. ఎవరూ లేని సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిచి..

ప్రేమించడం ఒక ఎత్తు అయితే ఆ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించడం ఇంకొక ఎత్తు అవుతుంది. అయితే తల్లితండ్రుల్ని ఒప్పించడానికి పిల్లలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అలా చేసినప్పటికీ కొందరు ఒప్పుకోరు. అలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్‌లో జరిగింది. ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని ఆ యువతి వింత నాటకమాడింది. ఎవరూ లేని సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ఆ తర్వాత జరిగిన కథేంటంటే..


నాగౌర్ జిల్లాలోని గోతన్ ప్రాంతానికి చెందిన కాంతాదేవి ఫడౌడా టీచర్‌గా పని చేస్తుంది. ఆమె కుమార్తె హిమాని ఫడౌడా సునిల్ జాట్ అనే వ్యక్తిని ప్రేమించింది. తన ప్రేమ విషయాన్ని హిమాని ఇంట్లో చెప్పగా కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. సునిల్ గోత్రం, హిమానీ గోత్రం ఒకటే అవడంతో పెళ్లి కుదరదని కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆ ప్రేమికులిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. అయితే హ్యాపీగా బతకాలంటే డబ్బులు కావాలని, ఆ డబ్బు ఎత్తుకెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు.


హిమానీ తండ్రి నాథురాం ఫడౌడా లెక్చరర్‌గా పనిచేసేవాడు. గత సంవత్సరం ఆయన కరోనాతో కన్ను మూశాడు. ఆయన సర్వీసు కింద కుటుంబానికి కొంత డబ్బు అందింది. వాటితో ఓ ప్లాట్ కొనుగోలు చేయాలని ఆ కుటుంబం భావించింది. అందుకు కావాల్సిన 42 లక్షల్ని బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో పెట్టారు. వాటితో పాటు హిమాని తల్లి, వదినలకు సంబంధించిన 99 తులాల బంగారాన్ని కూడా బీరువాలోనే దాచిపెట్టారు. ఆ విషయం హిమానీకి కూడా తెలిసింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15న ఇంట్లోని వారందరూ వారి పనులమీద బయటికి వెళ్లారు. అది గమనించి ప్లాన్ ప్రకారం హిమానీ తన ప్రియుడికి ఫోన్ చేసి పిలిచింది. ఇంట్లో దాచిపెట్టిన 42లక్షల నగదు, 99 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చి పంపించేసింది. 


తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి హిమాని ఎప్పటిలాగానే ఉంది. అదే రోజు సాయంత్రం ఆమె కూడా తల్లితో పాటు వాకింగ్‌కు వెళ్లింది. 45 నిమిషాల తర్వాత నీళ్ల కోసమని చెప్పి ఇంటికి వచ్చింది. ప్లాన్ ప్రకారం ఆమె బీరువా తీసి డబ్బు, నగలు లేవని పరుగెత్తికెళ్లి తల్లికి చెప్పింది. ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పి ఆమెను నమ్మించింది. ఇంటికి వచ్చిన తల్లి బీరువా చూసి షాకయింది. లబోదిబోమంటూ వెళ్లి పోలీలసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఇంటి దొంగల అసలు సంగతి బయటపెట్టారు. ఇద్దరిని అరెస్టు చేసి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-10-08T23:02:09+05:30 IST