Abn logo
Sep 21 2021 @ 01:07AM

పేదల హృదయాల్లో ‘ఇరిగినేని’కి సుస్థిర స్థానం

నివాళి అర్పిస్తున్న నాయకులు

పామూరు, సెప్టెంబరు 20: పేద ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని మరణం లేని మహామనిషిగా జీవిస్తున్న ఇరిగినేని చిరస్మరణీయుడని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. మండలంలోని మోపాడు, బొట్లగూడూరు గ్రామాల్లో దివంగత ఇరిగినేని తిరుపతినాయుడు 84వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మోపాడు గ్రామంలోని ఇరిగినేని ఘాట్‌ వద్ద ఉగ్ర, టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్త కోటపాటి జనార్థనరావు నాగూర్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రి చౌదరి, ఇరిగినేని తనయుడు రవీంద్రబాబుతో పాటు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మోపాడు బస్టాండ్‌ వద్ద ఇరిగినేని విగ్రహానికి, బొట్లగూడూరు పంచాయతీ కార్యలయం వద్ద ఉన్న ఇరిగినేని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కనిగిరి నియోజకవర్గంలో ఎంతో మంది శాసనసభ్యులుగా పనిచేసినా ఇరిగినేనికి మాత్రం కులాలు, మతాలకు అతీతంగా ప్రజల హృదయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఆయన అడుగుజాడల్లో పయనించి టీడీపీకి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భైరెడ్డి జయరామిరెడ్డి, దేవరపు మాల్యాద్రి, గుర్రం వెంకటేశ్వర్లు, వైఎస్‌.ప్రసాద్‌రెడ్డి, సయ్యద్‌ అమీర్‌బాబు, గంగరాజు యాదవ్‌, మన్నం రమణయ్య, దారపనేని మాధవరావు, ఎం.హుస్సేన్‌రావ్‌ యాదవ్‌, మెడబలిమి.వెంకట్రావు, ఏ.ప్రభాకర్‌ చౌదరి, కోటా చిన్నవెంకటేశ్వర్లు, అనపర్తి మహేశ్వరరావు, అడుసుమల్లి నరసింహారావు, పువ్వాడి రామారావు, గుంటుపల్లి శ్రీనివాసులు, ఇర్రి కోటిరెడ్డి, రామంజనేయులు, సుబ్బారావు, టీడీపీ శ్రేణులు, ఇరిగినేని అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

పామూరు : కనిగిరి మాజీ శాసనసభ్యుడు ఇరిగినేని తిరుపతినాయుడు 84వ జయంతి వేడుకలను మాజీ ఏఎంసీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈటిఎన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దారపనేని సౌజన్యంతో సమకూర్చిన చీరలను పలువురు మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భైరెడ్డి జయరామిరెడ్డి, కావిటి సుబ్బయ్య,  ఖాదర్‌మోహిద్దిన్‌, అమీర్‌బాష, బుడేసాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.