గుంటూరు జిల్లాలో కమిషనర్ జె నివాస్ ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2022-05-01T03:22:03+05:30 IST

జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు.

గుంటూరు జిల్లాలో కమిషనర్ జె నివాస్ ఆకస్మిక తనిఖీ

గుంటూరు: జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. శనివారం పెదకాకాని, పోన్నెకల్లు పీహెచ్‌స్సీల ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ రెండు పీహెచ్సీలలో పారిశుధ్యం, ప్రసవాలు, బయోమెట్రిక్ హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కమిషనర్ తదుపరి తనిఖీ నాటికి పనితీరును మెరుగు పర్చుకోవాలి లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది, వైద్య అధికారుల గైర్హాజరుపై ఆరా తీశారు. కమిషనర్ రెండు పీహెచ్సీలలోనూ ప్రసవాల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలలో ప్రసవాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. పీహెచ్సీలకు ఇంకా హెచ్‌డీసీ నిధులు చేరకపోవడంపై గుంటూరు డీఎంహెచ్‌వోకు ఫోన్లో ఆదేశాలిచ్చారు. 


పీహెచ్‌సీలకు నిధులు చేరాయని నివాస్ వెల్లడించారు.యూడీసీ గైర్హాజరుపై కమీషనర్ జె నివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఆర్‌డీ కార్యాలయానికి వెళ్లారని చెప్పగా వెంటనే గుంటూరు ఆర్డీకి  కాల్ చేశారు. అక్కడకు రాలేదని ఆర్డీ చెప్పటంతో ఆయన్ని సస్పెండ్ చేయాలని కమీషనర్ ఆదేశించారు. పోన్నెకల్లు పీహెచ్సీలో (ఎంపీహెచ్ఏ -మేల్)ఫార్మసిస్టు మందుల లెక్కలు సక్రమంగా చూపకపోవటంతో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. పెదకాకాని పీహెచ్‌సీలో కేవలం రెండు ప్రసవాలు మాత్రమే జరగడంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పోర్నెకల్లు పీహెచ్‌సీలో గత రెండు నెలలుగా ప్రసవాలు జరగకపోవడంపై కమిషనర్ జె నివాస్ ఆరా తీశారు. ప్రసవాలను పెంచాలని ఆస్పత్రి వైద్యులను  కమిషనర్ జె నివాస్ ఆదేశించారు.

Updated Date - 2022-05-01T03:22:03+05:30 IST