Viral Video: స్పైడర్ మ్యాన్ స్టంట్‌లో అపశృతి.. షాకైన నెటిజన్లు.. అసలు విషయమేమిటంటే..

ABN , First Publish Date - 2022-06-13T21:16:05+05:30 IST

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సిరీస్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు.

Viral Video: స్పైడర్ మ్యాన్ స్టంట్‌లో అపశృతి.. షాకైన నెటిజన్లు.. అసలు విషయమేమిటంటే..

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ సిరీస్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. ఆ సిరీస్‌లోని సినిమాలన్నీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కురిపించాయి. ఈ మధ్య రిలీజ్ అయిన `స్పైడర్ మ్యాన్: నో వే హోమ్` కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వసూళ్లు సాధించింది. గ‌తేడాది డిసెంబ‌ర్ 16న యూఎస్ కంటే ఒక రోజు ముందే భారత్‌లో రిలీజ్ అయింది. అంచనాల‌కు త‌గ్గ‌ట్టే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తాజాగా స్పైడర్ మ్యాన్ స్టంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


అమెరికాలోని డిస్నీ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్‌లో జరిగిన స్పైడర్ మ్యాన్ స్టంట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో స్పైడర్ మ్యాన్ తాడు సహాయంతో ఎగిరి, పల్టీలు కొడుతూ ల్యాండ్ అవ్వాల్సిన సమయంలో జారి కింద పడిపోయినట్టు ఉంది. ఆ వీడియో చూసిన అందరూ షాకయ్యారు. స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో ఉన్నది మనిషే అనుకున్నారు. అయితే అది స్పైడర్ మ్యాన్ రోబో అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-06-13T21:16:05+05:30 IST