గుంటూరు: జిల్లాలో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలకు ఓ విద్యార్థి బలి అయ్యాడు. చిలకలూరిపేట ఓగేరు వాగులో పడి విద్యార్థి గోగులమూడి సన్నీ గల్లంతయ్యాడు. వాగులో స్నానం చేయడానికి నలుగురు విద్యార్థలు దిగారు. ఇసుక అక్రమ తవ్వకాలతో వాగులో లోతు తెలియని గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతుల్లో పడి విద్యార్థి గల్లంతయ్యాడు. విద్యార్థి ఆచూకీ కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది.