ఎన్నికల హామీలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-02T04:08:29+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లా డుతూ ఎస్టీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇవ్వలే దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద లక్షల మందికి ఇండ్లు నిర్మిస్తుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకా న్ని ప్రకటించి అమలుకు పూనుకోలేదని విమర్శిం చారు.

ఎన్నికల హామీలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణదేవి

ఏసీసీ, జూలై 1: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లా డుతూ ఎస్టీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇవ్వలే దన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద లక్షల మందికి ఇండ్లు నిర్మిస్తుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకా న్ని ప్రకటించి అమలుకు పూనుకోలేదని విమర్శిం చారు. దళితులందరికి దళిత బంధు పథకాన్ని అమ లు చేయకుండా మోసగించిందన్నారు. ప్రధాని మోదీ అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెడితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  యువకులను పక్కదారి పట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌,  ఉచిత ఆహార ధాన్యాలు కేంద్రం అందజేసిందన్నారు. మంచిర్యాలలో  మెడికల్‌ కళాశాల, నేషనల్‌హైవే 63, 363లను ఫోర్‌ లేన్‌గా మార్పు, రైల్వే అండర్‌ బ్రిడ్జిని కేంద్రం నిధుల తో నిర్మించామన్నారు. సింగరేణి బొగ్గు గనుల నుంచి వచ్చే లాభాలను కేంద్రం ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతుందన్నారు. ఈనెల 3న హైద్రాబాద్‌లో నిర్వ హించే మోదీ సభను విజయవంతం చేయాలన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిర నిర్మాణం, త్రిపుల్‌ తలాక్‌లపై ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. నెల్కి వెంకటాపూర్‌లో దశాబ్దాల క్రితం ఎస్సీలకు ఇచ్చి న భూమిని ప్రభుత్వం లాగేసుకుంటుందని  మహిళ లు ఫిర్యాదు చేశారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, వెంకటేశ్వర్‌ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

దండేపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో నియం త్ర పాలనను సాగిస్తూ ప్రజా సంపదను దోచుకోని దాచుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ సహాయ మం త్రి అన్నపూర్ణదేవి అన్నారు. నెల్కివెంకటాపూర్‌లో కేం ద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమ య్యారు. దేశంలో అవినీతిలో నంబర్‌వన్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిలుస్తారని, అవినీతి అంతం కావాలం టే రానున్న ఎన్నికల్లో  కేసీఆర్‌ను గద్దెదించాలని అన్నారు. నిరుపేదల కోసం ఉచిత ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్‌, రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధిద్వారా ఏడాదికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.     నాయకులు మున్నారాజ్‌ సిసోడియో, శ్రీనివాస్‌, మం డల అధ్యక్షకార్యదర్శు రాజయ్య, రవిగౌడ్‌  పాల్గొన్నారు.

గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయాన్ని  కేం ద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి సంద ర్శించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది మంత్రిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.  ప్రధానాలయంలో  స్వామివారి ఆశీర్వచనాలు, స్వామి వారి చిత్రపటం, తీర్ధప్రసాదాలను అందజేశారు. 

 

Updated Date - 2022-07-02T04:08:29+05:30 IST