Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిలిచిన స్త్రీశక్తి భవనం

అసంపూర్తిగా పనులు

నిర్మాణానికి చాలని నిధులు

ఇబ్బందులు పడుతున్న సిబ్బంది

పట్టించుకోని అధికారులు

త్రిపురాంతకం, అక్టోబరు 27 : మహిళలు స్వచ్ఛందంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహణకై ప్రభుత్వం ప్రత్యేకంగా స్త్రీశక్తి భవనాలను నిర్మించాలని భా వించింది. వాటిలో ఆ శాఖలకు సంబంధించిన శిక్షణ తరగతులు, సంయుక్త సమావేశాలతో పాటు అన్ని కా ర్యకలాపాలు నిర్వహించేందుకు భవనాలను మం జూరు చేశారు. అంతేకాకుండా ఉపాధిహామీ పథకం కార్యాలయానికి కూడా ఉపయోగించుకునేలా రూపకల్పన చేశారు. 

ఈ క్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో  ఒక్కో భవనానికి రూ.25 లక్షలతో ఉపాధి పథకం నిధులు డీఆర్‌డీఏ మంజూరు చేసింది. దీంతో అప్పుడు పనులు ప్రారంభించి నిధులు సరిపోవనే ఉద్దేశంతో నిర్మాణాన్ని మధ్యలో నిలిపివేశారు. భవనాన్ని నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.32 లక్షలకు అంచనాలు తయారు చేసి పనిని మంజూరు చేశారు. దీంతో 2015 డిసెంబరులో పనులు పునఃప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.20 లక్షలు ఖర్చు చేయగా, కేవలం రూ.10 లక్షలు మాత్రమే బిల్లులు రావడంతో చేసేదిలేక నిర్మాణ పనులను 2016 అక్టోబరులోనే నిలిపి వేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరేళ్లు కావస్తున్నా పురోగతిలో అడుగు ముందుకు పడలేదు. మహిళల కోసం బ్యాంకు కలగానే మిగిలింది. మిగతా మండలాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారుల చొరవతో నిధు లు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేశారని డ్వాక్రా సంఘాల మహిళలు అంటున్నారు. కాగా మండల మహిళా సమైక్య సమావేశాలు నిర్వహించాలంటే ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యాలయం ఇరుకుగా ఉండటంతో ఇబ్బందిగా ఉంది. కంప్యూటర్లు పెట్టుకునేందుకు, పత్రాలు భద్రపరచుకునేందుకు స్థలం సరిపోవడంలేదు. 


Advertisement
Advertisement