Advertisement
Advertisement
Abn logo
Advertisement

జవాన్‌కు ఘన నివాళి

  1. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  2. తరలివచ్చిన ప్రముఖులు, అశేష జనం


అవుకు, డిసెంబరు 5: దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు అర్పించిన ఆర్మీ జవాను సిద్ధిసుబ్బరామయ్యకు అధికార లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. దేశ సరిహద్దు ప్రాంతంలోని నార్త్‌ సిక్కింలో మంచు చరియలు విరిగి పడి అవుకు పట్టణానికి చెందిన సుబ్బరామయ్య మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంతకు మునుపు ఆర్మీ అధికారులు సైనిక వందనం సమర్పించారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ చల్లా విజయభాస్కర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ చల్లా రఘునాథ్‌రెడ్డి, నాయకులు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జయచంద్రారెడ్డి, కాటసాని ఓబుళరెడ్డి, తిరుపాల్‌రెడ్డి, సీఐ సుబ్బరాయుడు, అవుకు, బనగానపల్లె ఎస్‌ఐలు జగదీశ్వరరెడ్డి, కృష్ణమూర్తి, మాజీ ఆర్మీ అధికారులు, భారీ సంఖ్యలో పట్టణ ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు. జవాను కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వైకుంఠ రథంలో అవుకు ప్రధానవీధుల గుండా జవాను భౌతిక కాయాన్ని ఊరేగిస్తూ శ్మశానవాటికకు చేర్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ జవాన్‌ అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. దీంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. 

Advertisement
Advertisement