Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్యకు ఘన నివాళి

నారాయణపేట, డిసెంబరు 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం రోశయ్యకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని సత్యనా రాయణ చౌరస్తాలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి  నివాళి అర్పించారు. కార్యక్రమంలోఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుజేంద్ర శెట్టి, మండలా ధ్యక్షుడు రవీందర్‌, రాజకీయ కమిటీ చైర్మన్‌ రఘునాథ్‌ గుప్తా, రైతు సేవా కమిటీ అధ్యక్షుడు వెంకోబా, రఘు, బీజేపీ నాయకులు ప్రభాకర్‌ వర్దన్‌, రఘువీర్‌, సత్యయాదవ్‌, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు రవీందర్‌రెడ్డి, సతీష్‌ గౌడ్‌, శరణప్ప, గౌసుద్దీన్‌, యూసూఫ్‌ తాజ్‌, టీడీపీ గోపాల్‌ యాదవ్‌, కాశీనాథ్‌, నారాయణ, బీకేఎస్‌ అనంత్‌రెడ్డి, రంగారెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌ : రోశయ్య అకాల మరణం పట్ల మండలంలోని కోటకొండ గ్రామంలో శనివారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ్యులు సన్నిది కుమార్‌, సుదర్శన్‌, కృష్ణయ్య, భీంశంకర్‌,  శంకరయ్య పాల్గొన్నారు.

ధన్వాడ : మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు రోశయ్య మృతిపై ధన్వాడ కాంగ్రెస్‌ మండల నాయకులు శనివారం సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు నరహరి, జట్రం లక్ష్మయ్యగౌడ్‌, ఇర్ఫాన్‌, బోయ బాల్‌రాజు, జుట్ల ఆనంద్‌గౌడ్‌,  గోవర్దన్‌గౌడ్‌,  రాము,  వెంకటి, నరేందర్‌ ఉన్నారు.

నారాయణపేట టౌన్‌ :  మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల శనివారం దామ రగిద్ద మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ పార్టీ నాయకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రోశయ్య మృతి పార్టీకి తీరనిలోటు అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, మాజీ సర్పంచ్‌ భీమయ్యగౌడ్‌, కోప్షన్‌ మెంబర్‌ శరణప్ప, శరణ్‌నాయక్‌, శ్రీనివాస్‌, బాల్‌రెడ్డి, శేఖరయ్య, గుండయ్య,  వెంకటప్ప, ఆనందు, నారాయణ ఉన్నారు. 

మక్తల్‌ :  మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ రోశయ్య మరణం కాంగ్రెస్‌కు తీరని లోటు అని కాంగ్రెస్‌ నాయకుడు వాకిటి శ్రీహరి, తెలం గాణ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ గుప్తా పేర్కొన్నారు. శనివారం వాకిటి శ్రీహరి స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్‌ సురేష్‌కుమార్‌ గుప్తా, నాయకులు గణేష్‌ కుమార్‌, విజ్ఞేష్‌, నారాయణ, మల్లేష్‌, నరేందర్‌, కట్ట వెంకటేష్‌, హరిక్రిష్ణ, రవికుమార్‌, ఫయాజ్‌, నూరుద్దీన్‌, రవి, గోవర్దన్‌, రాజేందర్‌ పాల్గొన్నారు. 

కృష్ణ : మండల కేంద్రంలోని క్షీర లింగేశ్వర కమరి మఠంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్ర పటానికి ఆర్యవైశ్య మండలాధ్యక్షుడు నరసిం హశెట్టి పూలమాల వేసి నివాళి అర్పించారు.  సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంకటేష్‌, రవికుమార్‌ పాల్గొన్నారు. 

మరికల్‌ : మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి చెందడంతో మండల కేంద్రంలోని ఇందిరా గాంఽధీ చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రోశయ్య చిత్ర పటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.దామరగిద్దలో


Advertisement
Advertisement