ఎన్టీఆర్‌ అందరికీ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-01-19T05:29:35+05:30 IST

దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని, తెలుగు ప్రజలతో పాటు తాము కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు అన్నారు.

ఎన్టీఆర్‌ అందరికీ స్ఫూర్తి
శాంతినగర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు

- దివంగత నాయకుడికి ఘన నివాళి

గద్వాల అర్బన్‌/ వడ్డేపల్లి/ అలంపూర్‌/ అయిజ జనవరి 18 : దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని, తెలుగు ప్రజలతో పాటు తాము కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంజిపేట రాములు అన్నారు.  ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పాతబస్టాండ్‌ సర్కిల్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ పార్టీని స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే అఖండ మెజార్టీ సాధించి, ముఖ్యమంత్రి అయి, తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు ఇస్మాయిల్‌, పుల్లయ్య గౌడ్‌, నరసింహులు, రఘు, జమన్న, వెంకటన్న, సి.వెంకటన్న పాల్గొన్నారు.


పేదల నాయకుడు ఎన్టీఆర్‌

పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమ లు చేసిన గొప్పనాయకుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు పూర్ణచంద్రారావు కొనియాడారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం మునిసిపాలిటీ కేంద్రమైన శాంతి నగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజేంద్రగౌడ్‌,  మండల నాయకులు భాస్కరరావు, సుబ్బారావు, చాణక్య, సాయిశేఖర్‌, కృష్ణమూర్తి, రామాంజనేయు లు గౌడ్‌, సూర్యకాంతరెడ్డి, ముఖర్జీ పాల్గొన్నారు. 


ఎన్టీఆర్‌ దేశానికే ఆదర్శం

పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన ఎన్టీఆర్‌ దేశానికే ఆదర్శ నాయకుడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు అన్నారు.  ఎన్టీఆర్‌ వర్ధం తి సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు ఎన్టీఆర్‌ను గుండెల్లో నిలుపుకున్నారన్నారు. కార్య క్రమంలో పట్టణ అధ్యక్షుడు ముజీబ్‌, జిల్లా నాయకులు చంద్రశేఖర్‌ నాయుడు, ఎస్‌సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు హుసేనప్ప, దేవదాస్‌, హమాలి మద్దిలేటి, బండల వెంకట్రాముడు పాల్గొన్నారు. 


- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ వర్ధంతిని పురస్కరించు కొని అయిజ కొత్తబస్టాండు ముందు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. టీడీపీ మండల అధ్యక్షుడు సుధాకర్‌గౌడు సూచన మేరకు ప్రధాన కార్యదర్శి తూముకుంట ఈరన్నగౌడు అధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు భీమన్న, శేఖర్‌, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ అభిమానులు శ్రీధర్‌, కృష్ణారెడ్డి, వీరేష్‌, లింగం పాల్గొన్నారు.



Updated Date - 2022-01-19T05:29:35+05:30 IST