Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహాత్మా జ్యోతిబాఫూలేకు ఘన నివాళి

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 28: అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబా ఫూలే కృషి చేశారని ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం జాతీయ నాయకుడు కొంకటి లక్ష్మణ్‌ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతి సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్‌ భవన్‌లో జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సావిత్రీబాయి విద్యను నేర్చుకుని మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పేరుపొందిందన్నారు. ఫూలే చేసిన అభివృద్ధిని తరతరాలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. దుబాసి బొందయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంపెల్లి సతీష్‌, పోగుల రంగయ్య, శనిగరపు రామస్వామి, హరీష్‌, పంజా అశోక్‌ పాల్గొన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పూలే 131వ వర్ధంతికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలోని బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కులాల అభివృద్ధికి జ్యోతిబా ఫూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. అంబేద్కర్‌ గురువుగా ఉన్న జ్యోతిబా ఫూలే అనేక మందికి విద్యనందించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బైరం శంకర్‌, చిటికెట రాజలింగు, లక్ష్మయ్య, రాజనర్సు, స్వామి, అంకిరెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement