కుమరం భీంకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-10-23T11:00:21+05:30 IST

జిల్లా కేంద్రంలో కుమరం భీం జయంతి వేడుకలను పుర్కరించుకుని ఐబీ గెస్ట్‌హౌజ్‌లో గురువారం సింగరేణి కార్మికుల బిడ్డల సంఘం (ఎస్‌కేబీఎస్‌) ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

కుమరం భీంకు ఘన నివాళి

ఏసీసీ, అక్టోబరు 22: జిల్లా కేంద్రంలో కుమరం భీం జయంతి వేడుకలను పుర్కరించుకుని ఐబీ గెస్ట్‌హౌజ్‌లో గురువారం సింగరేణి కార్మికుల బిడ్డల సంఘం (ఎస్‌కేబీఎస్‌) ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ళ నరేష్‌ మాట్లాడుతూ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన గిరిజన యోధుడు భీం అని కొనియాడారు., జల్‌, జంగల్‌, జమీన్‌, స్వపరిపాలన కోసం ఆయన చేసిన పోరాటం భావి తరాల్లో స్ఫూర్తిని నింపిందని తెలిపారు. తన జీవితాన్ని గిరిజనుల కోసం అంకితం చేశారని చెప్పారు. ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కీర్తి ప్రతిష్టలు ఆయన పోరాటం ద్వారా ఇనుమడించాయని కొనియాడారు.  కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి పశ సత్యం, డివిజన్‌ కార్యదర్శి దూట లింగస్వామి, పట్టణ కార్యదర్శి సుదమల్ల దామోదర్‌, అనుమాండ్ల సతీష్‌, మేరుగు రవీందర్‌, మాడుగుల సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


జన్నారం: మండలంలోని ఇందన్‌పల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భీం విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకోటి జలేందర్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీరాము గంగాధర్‌, మండలం యూత్‌ అధ్యక్షుడు శివనూరి శ్రీనివాస్‌ మురిమడుగు భూమాచారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-23T11:00:21+05:30 IST