Abn logo
Oct 20 2020 @ 01:40AM

గుండా మల్లేష్‌కు ఘన నివాళి

తాండూర్‌(బెల్లంపల్లి), అక్టోబరు 19: తాండూర్‌ ఐబీ కేంద్రంలోని భగత్‌సింగ్‌ భవన్‌లో దివంగత బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ చిత్రపటానికి సోమవారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మామిడాల రాజేశం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండా మల్లేష్‌ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ బానయ్య, ఎంపీపీ ప్రణయ్‌, ఇన్‌చార్జి సర్పంచ్‌ నవీన్‌, ఎంపీటీసీలు సూరం రవీందర్‌, సిరంగి శంకర్‌, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రామడుగు లక్ష్మణ్‌, చిప్ప నర్సయ్య, బానేష్‌, సీపీఐ, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. 


ప్రజల పక్షపాతి..

లక్షెట్టిపేట: గుండా మల్లేష్‌ ప్రజల పక్షపాతి అని సీపీఐ మండల కార్యధర్శి మేదరి దేవరం అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  కార్యక్రమంలో నాయకులు వెంకటేష్‌, రవికిరణ్‌, సుమన్‌, రమణారెడ్డి, అజయ్‌, పోచన్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement