Advertisement
Advertisement
Abn logo
Advertisement

మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఘన నివాళి

జూలపల్లి, డిసెంబర్‌ 5 : మండలంలోని కాచాపూర్‌ గ్రామంలో ఆది వారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మండ ల కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి దివంగత కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆత్మచేకూరాలని మౌనం పాటించారు. ఈసందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సీని యర్‌ నాయకులు రోశయ్య తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చేపట్టి వాటికి వన్నెతెచ్చాడన్నారు. రోశయ్య మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీర నిలోటని ఆయన సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు గండు సంజీవ్‌, మానుమండ్ల శ్రీనివాస్‌, ఈర్ల స్వామి, లోక జలప తిరెడ్డి, కొమ్మపోచాలు, బండి స్వామి, సిరికొండ కొమురయ్య, కనకట్ల న ర్సింగం, మాంకాలి అంజయ్య, వేల్పుల లింగయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement