Abn logo
Jun 20 2021 @ 00:49AM

ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌కు ఘన నివాళి

బత్తలపల్లి, జూన19: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్‌ఫెర్రర్‌ 13వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆర్డీటీ సిబ్బంది కరోనా నిబంధనలు పాటిస్తూ ఫెర్రర్‌ సమాధి వద్ద  నివాళులర్పించారు. మండలంలోని కట్టకిందపల్లి, సంజీవపురం, ఈదులముష్టూరు, సూర్య చంద్రాపురం, మాల్యవంతం తదితర గ్రామాల్లో ఫెర్రర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీ మల్లికా ర్జున, ఏటీఎల్‌ వేమయ్య, ఎస్‌టీఎల్‌ కావేరి, శ్రీరాములు, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ధర్మవరంరూరల్‌: పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఫాదర్‌ఫెర్రర్‌ ఆశయమని ఏటీఎల్‌ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. శని వారం ఫాదర్‌ఫెర్రర్‌ వర్ధంతి సందర్భంగా మండలంలోని గొ ట్లూరు గ్రామంలో ఉన్న ఫాదర్‌ఫెర్రర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం ఏటీఎల్‌ మాట్లాడుతూ అనంతజిల్లా పేదరిక నిర్మూలనకు ఫెర్రర్‌ ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. అదే విధంగా చిగిచెర్ల గ్రామంలో ఎస్సీకాలనీ వాసులు ఫాదర్‌ఫెర్రర్‌ చిత్రప టానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఓలు, సీడీసీ సభ్యులు, మహిళ సంఘం సభ్యులు, కాలనీవాసులు యూత పాల్గొన్నారు. 

నంబులపూలకుంట:   మండలంలోని ముక్కంవారిపల్లి, ఎస్‌కే తండాలలో శనివారం ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటీఎల్‌ క్రిష్ణ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఫాదర్‌ ఫెర్రర్‌ ఆర్డీటీని స్థాపించి ఎంతో సేవ చేశారన్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, పేదలకు ఉచిత వైద్యం, నివాసాలు లేని వారికి ఉచిత గృహాలు, మహిళా సంఘాలు  ఏర్పాటు చేసి, పేదల ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ముక్కంవారి పల్లిలో ఉన్న ఫాదర్‌ ఫెర్రర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివా ళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

ముదిగుబ్బ: మండల కేంద్రంలోని ఆర్డీటీ కార్యాలయంలో శనివారం ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌కు ఘన నివాళులర్పించారు. ముందుగా కార్యాలయంలో ఫెర్రర్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆర్డీ మాట్లాడుతూ..సంస్థ జిల్లా ప్రజలకు విద్య, వైద్యం, గృహకల్పన, రైతులకు వాటర్‌షెడ్‌లు, పిల్లలకు క్రీడల ద్వారా ఆత్మవి శ్వాసం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిపోయిన వ్యక్తి ఫెర్రర్‌ అన్నారు. అలాగే అడవిబ్రాహ్మణ పల్లితండా, జొన్నలకొత్తపల్లి, రాళ్ల అనంతపురం గ్రామాల్లో కూడా పెర్రర్‌ వర్ధంతిని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటీఎల్‌ సంజీవరెడ్డి, సీఓ కళావతి, సిబ్బంది పాల్గొన్నారు.