Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సుపరిపాలనకు మార్గదర్శి అంబేడ్కర్‌

twitter-iconwatsapp-iconfb-icon
సుపరిపాలనకు మార్గదర్శి అంబేడ్కర్‌గద్వాలలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి

- జిల్లా వ్యాప్తంగా బాబాసాహెబ్‌ వర్ధంతి

- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు

గద్వాల టౌన్‌/గద్వాల క్రైం/ గద్వాల రూరల్‌/ అలంపూర్‌/ వడ్డేపల్లి/ గట్టు/ మల్దకల్‌/ అలంపూర్‌ చౌరస్తా/ ఉండవల్లి/ ఎర్రవల్లి చౌరస్తా/ అయిజ/  మానవపాడు/ ఇటిక్యాల/ డిసెంబరు 6 : భారత జాతికి సుపరిపాలనను అందించేందుకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. అంబేడ్కర్‌ 65వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని దివంగత నాయకుడి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతయ్య, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా డీసీసీ బ్యాంకు డైరెక్టర్‌ ఎంపీ సుభాన్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోవిందు,  కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, మురళి, నరహరి గౌడ్‌, మహేష్‌, నాయ కులు నాగులుయాదవ్‌, సాయిశ్యాంరెడ్డి, కురుమన్న, భాస్కర్‌, మన్యం, కోటేష్‌, భాస్కర్‌, సీతారాములు, షుకూర్‌ ఉన్నారు.


- గద్వాల పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, రవి ఎగ్బేటే, జీఎల్‌ చందు, నాగేందర్‌ యాదవ్‌, పులిపాటి వెంకటేష్‌, దేవదాసు, కుమ్మరి శ్రీనివాసులు, రజక నరసింహులు, చిత్తారి కిరణ్‌, భాస్కర్‌ యాదవ్‌, బండల పద్మావతి, కృష్ణవేణి, అనిత, జయశ్రీ పాల్గొన్నారు.


- గద్వాల మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి పుష్పమ్మ, సెక్రటరీ నరసింహ, అధికారులు, సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు కురుమన్న పాల్గొన్నారు.


-  ఎంఐఎం నాయకులు, కౌన్సిలర్‌ బంగి ప్రియాంక ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో లక్ష్మన్న, సుదర్శన్‌, నరసింహ, శ్రీను, రాము, అజీజ్‌, అక్రమ్‌, ఇలియాస్‌, అజార్‌, సోహైల్‌,  రాజు, నవీన్‌, బాబు, దౌలత్‌, షాకీర్‌, గణేష్‌, హనుమంతు పాల్గొన్నా రు. ఏబీపీవీ నాయకులు సతీష్‌, నవీన్‌, కుమార్‌ రెడ్డి, వంశీ, రామకృష్ణ, నరేష్‌, విష్ణు, శ్రీకాంత్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 


- మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బంగి రంగారావు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. నాయకులు చంద్రశేఖర్‌, గోపాల్‌, భూషన్‌, నల్లన్న, క్రిష్ణ, శేఖర్‌, సురేష్‌, సుధాకర్‌, రామచందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


భావితరాలకు స్ఫూర్తిదాయకం : ఎస్పీ

డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితం భావితరాలకు  స్ఫూర్తిదాయకం అని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆయన విగ్రహానికి, జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ రంగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 


సమరశీల పోరాటాల్లో చెరగని ముద్ర : మందా జగన్నాథ్‌

సామాజిక న్యాయం కోసం జరిగిన సమరశీల పోరాటాల్లో చెరగని ముద్ర వేసిన మహనీయుడు బీఆర్‌ అంబేడ్కర్‌ అని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎంపీ మందా జగన్నాథ్‌ అన్నారు. ఇటిక్యాల మండలం కొండేరులోని ఆయన స్వగృహంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మందా శ్రీనాథ్‌, రామిరెడ్డి, బలరాముడు, శ్రీకాంత్‌, రామాచారి, మద్దిలేటి పాల్గొన్నారు.


- గద్వాల మండలంలోని బీరెల్లి, అనంతపురం, పూడూరు, శెట్టి ఆత్మకూర్‌, కాకుళారం, కొత్తపల్లి, సంగాల, గోనుపాడు తదితర గ్రామాల్లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. బీరెల్లిలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, నాయకులు రమేష్‌ నాయుడు, రాధాకృష్ణారెడ్డి, నీలేశ్వర్‌రెడ్డి, బీస న్న, దానయ్య, ఆరుణ్‌, కుమార్‌ జార్జీ, అశోక్‌, వేదాం తం తదితరులు పాల్గొన్నారు.


- అలంపూరు పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పార్టీలు ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేవీపీఎస్‌, టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు, అంబేడ్కర్‌ చైతన్య యువజన సంఘం సభ్యులు ఆంజనేయులు, రాజు, రజనీబాబు, శరత్‌బాబు, నరసింమా, మద్దిలేటి, శ్రీధర్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


- అలంపూర్‌ గాంధీచౌక్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి బీజేపీ దళిత మోర్చా అలంపూరు అధ్యక్షుడు శ్రీధర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పి.రాజగోపాల్‌, పట్టణ అధ్యక్షు డు నాగమద్దిలేటి, మండల అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి, మండల మోర్చా అధ్యక్షుడు సుధాకర్‌ యాదవ్‌, పట్టణ యువమోర్చా అధ్యక్షుడు శరత్‌బాబు, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కాసాపురం అయ్యన్న, వరప్రసాద్‌ పాల్గొన్నారు. 


- అలంపూర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీలో చైతన్య యువజన సంఘం అధ్యక్షుడు రజని ఆధ్వ ర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.  అంబేడ్క ర్‌ కాలనీ నుంచి  ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. 


- వడ్డేపల్లి మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌ లో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణసూరి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు కొంకల భీమన్న ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు వడ్డేపల్లి దేవేంద్ర, వైస్‌ చైర్‌పర్సన్‌ సుజాత, నాగశిరోమణి, శేఖర్‌, వై రామ్మోహన్‌, వడ్డేపల్లి మండల నాయకులు కృష్ణకాంత్‌, ఏసేపు, మద్దిలేటి, మత్తయ్య, కొంకల నాయుడు, మహేష్‌ పాల్గొన్నారు. 


- గట్టు మండలంలోని మాచర్లలో జడ్పీటీసీ సభ్యు రాలు బాసు శ్యామల, సర్పంచ్‌ సిద్ధిరామప్ప అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ విజయ్‌, పీఏసీఎస్‌ కార్యాలయంలో క్యామ వెంకటేష్‌ నివా ళి అర్పించారు. పంచాయతీ కార్యాలయ అవరణలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మారెప్ప, ఎమ్మార్పీఎస్‌ నేతలు ఏసన్న, ఇమ్మానియేల్‌, బల్గెరలో ముక్కేరన్న, మొహన్‌, బండారి డేవిడ్‌, మాచర్ల ఆనంద్‌, టీఅర్‌ఎస్‌ నేతలు సంతోష్‌, వెంకటేశ్‌, బజారి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.


- మల్దకల్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనం గా నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కిశోర్‌ అతిథులుగా హాజరయ్యారు. జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేశ్‌, తిరుమల్‌, రామాంజనేయులు, నాగరాజు పాల్గొన్నారు. పాలవాయి గ్రామంలో సర్పంచ్‌ శివరామిరెడ్డి, ఎంపీటీసీ యశోదమ్మ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తాటికుంటలో అంబేడ్కర్‌ యువ జన సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. 


- అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయ కుడు డాక్టర్‌ ఆజయ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆనంతరం బొంకూరు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో బొంకూరు సర్పంచు శ్రీలత, నాయకులు కాశపోగురాజు, తేజ, బీవీ రమణ, శ్రీనివాసరెడ్డి, అల్లాబకాష్‌, కోనేరునరసింహ, వెంకటేష్‌, మహేష్‌, నరేంద్ర, ప్రకాష్‌, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


- ఉండవల్లిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ రేఖ, ఎస్‌ఐ జగన్‌మోహన్‌  పూలమాల వేసి, కొవ్వొత్తులను వెలిగించి నివాళి అర్పించారు. బైరాపురంలో ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అంబే డ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచు సయ్యద్‌ రహమత్‌ హుస్సేన్‌, కెవీపీఎస్‌ మండల కార్యదర్శి పరశురాం, సీఐటీయూ మండల కన్వీనర్‌ వెంకటేశ్వర్లు, బీఎస్పీ మండల కార్యదర్శి ప్రభుదాస్‌, ఎంపీటీసీ సభ్యులు రాజశేఖర్‌, సుంకన్న, అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు అయ్యన్న, రాజు, పాండు, ఆనంద్‌, మధు పాల్గొన్నారు. 


- రాజోలి బస్టాండు వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి కేవీపీఎస్‌ మండల కార్యదర్శి విజయ్‌కుమార్‌, ఉపసర్పంచు గోపాల్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. ముండ్లదిన్నె గ్రామంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్సు, మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు రేపల్లె పెద్దబాబు అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. రాజోలి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కేవీసీఎస్‌ నాయకులు విజయ్‌కుమార్‌, సుధాకర్‌, ఉపసర్పంచు గోపాల్‌, ప్రజలు పాల్గొన్నారు. 


- అయిజలో మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి తదిత రులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 


- అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని మానవ పాడులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అమరవాయి మాజీ సర్పంచ్‌ కాంతారెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షుడు శంకర్‌ గౌడ్‌, రహిమత్‌, సుంకన్న, మద్దిలేటి, తిప్పన్న, కబ్లా తదితరులు పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యం లో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.


- ఇటిక్యాల మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు జీ మణికుమార్‌ పూల మాల వేసి నివాళి అర్పించారు. స్వేరోస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు రాంబాబు, వీరేష్‌, మణిరత్నం, రాముడు, హుస్సేన్‌, సమీర్‌, భాస్కర్‌, రంజిత్‌, రవి, రాజు, రాజశేఖర్‌, సంపత్‌, రవి తేజ, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

సుపరిపాలనకు మార్గదర్శి అంబేడ్కర్‌అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, సిబ్బంది


సుపరిపాలనకు మార్గదర్శి అంబేడ్కర్‌అలంపూరులో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తున్న అంబేడ్కర్‌ కాలనీవాసులు, నాయకులు, చిన్నారులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.