Abn logo
Oct 2 2020 @ 01:19AM

పెదాలపై చిరునవ్వు మెదులుతుంది

Kaakateeya

అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా చిరంజీవి ఆయన్ను స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘మావయ్య పేరు గుర్తురాగానే అందరి పెదాలపైనా చిరునవ్వు మెదులుతుంది. ఆయన హాస్యంతో ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడే కాదు తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియో డాక్టర్‌ కూడా. స్వాతంత్ర సమరయోధుడు, తత్వవేత్త, నాకు మార్గదర్శి, గురువు. అన్నిటికి మించి మంచి మనిషి. ఈ 99వ జయంతి రోజు ఆయన్ను స్మరిస్తూ, వచ్చే ఏడాది ఆయన శత జయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement