12150 పైన స్వల్ప అప్‌ట్రెండ్‌

ABN , First Publish Date - 2020-02-20T06:32:46+05:30 IST

నిఫ్టీ రికవరీలో ప్రారంభమై 12000 వద్ద బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. ఆ తర్వాత రోజంతా నిలకడగా ట్రేడవుతూ చివరికి 130 పాయింట్ల

12150 పైన స్వల్ప అప్‌ట్రెండ్‌

నిఫ్టీ రికవరీలో ప్రారంభమై 12000 వద్ద బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. ఆ తర్వాత రోజంతా నిలకడగా ట్రేడవుతూ చివరికి 130 పాయింట్ల లాభంతో డే గరిష్ఠ స్థాయిలో క్లోజయింది. ఈ బలమైన రికవరీతో తక్షణ కరెక్షన్‌ ముప్పు నుంచి బయటపడి సురక్షిత జోన్‌లోకి ప్రవేశించినట్టు కనిపిస్తోంది. మరోసారి స్వల్పకాలిక నిరోధం 12150 స్థాయిలో పరీక్షకు సమాయత్తం అవుతోంది. గత కొద్ది వారాలుగా మార్కెట్‌ కన్సాలిడేషన్‌ ట్రెండ్‌లో ట్రేడవుతోంది. 

బుధవారం స్థాయిలివే...

నిరోధం : 12150 మద్దతు : 12080

ఇంట్రాడే మైనర్‌ నిరోధం 12150. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఆ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 12230, 12300.

12150 వద్ద విఫలమైతే బలహీనతకు ఆస్కారం ఉంటుంది. మరింత బలహీనపడి మైనర్‌ మద్దతు స్థాయి 12080 కన్నా దిగజారితే మైనర్‌ బలహీనత సాధిస్తుంది. 

తదుపరి దిశకు సమాయత్తం అవుతున్నందు వల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - 2020-02-20T06:32:46+05:30 IST