స్వల్పంగా పెరిగిన టమోటా ధరలు

ABN , First Publish Date - 2021-09-29T05:49:48+05:30 IST

మదనపల్లె టమోటా యార్డులో మంగళవారం టమోటా ధరలు స్వల్పంగా పెరిగాయి. నెల రోజుల క్రితం కిలో టమోటా రూ.20 పలుకగా తరువాత ధరలు తగ్గిపోతూ వచ్చాయి.గత పదిరోజులు కిలోకు రూపాయి చొప్పున పెరుగుతున్న టమోటా ధరలు మంగళవారానికి నాణ్యమైన టమోటా గరిష్ఠ ధర రూ.26 పలుకగా, రెండో రకం రూ.10కి చేరుకుంది.

స్వల్పంగా పెరిగిన టమోటా ధరలు
మదనపల్లె టమోటా యార్డులో విక్రయానికి వచ్చిన టమోటా

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 28: మదనపల్లె టమోటా యార్డులో మంగళవారం టమోటా ధరలు స్వల్పంగా పెరిగాయి. నెల రోజుల క్రితం కిలో టమోటా రూ.20 పలుకగా తరువాత ధరలు తగ్గిపోతూ వచ్చాయి. నాణ్యమైన టమోటా ఏకంగా కిలో రూ.10కి తగ్గిపోగా రెండో రకం టమోటా కనిష్ఠంగా రూ. 5కు పడిపోయింది. ఈ క్రమంలో రైతులకు పంటసాగు ఖర్చులు సరికదా మార్కెట్‌యార్డుకు టమోటా రవాణా చార్జీలు కూడా చేతికి రాలేదు. గత పదిరోజులు కిలోకు రూపాయి చొప్పున పెరుగుతున్న టమోటా ధరలు మంగళవారానికి నాణ్యమైన టమోటా గరిష్ఠ ధర రూ.26 పలుకగా, రెండో రకం  రూ.10కి చేరుకుంది. ప్రతి రోజూ మార్కెట్‌కు 450 టన్నుల చొప్పున టమోటా విక్రయానికి వస్తుండగా, మంగళవారం 369 టన్నులు మాత్రమే విక్రయానికి వచ్చాయి. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ఈ మాత్రం ధరలు పలికాయని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2021-09-29T05:49:48+05:30 IST