పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-19T05:46:33+05:30 IST

సర్దార్‌ సర్వాయి పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. పాపన్న జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పథి

 కలెక్టర్‌ పమేలా సత్పథి

భువనగిరిరూరల్‌, ఆగస్టు 18 :  సర్దార్‌ సర్వాయి పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. పాపన్న జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదే విధంగా జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కుడుదుల నగేశ్‌, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డిలు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌ తివారి, కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, బీసీ సంఘం నేతలు కొత్త నర్సింహస్వామి, రావుల రాజు, కొత్త బాలరాజు, మాటూరి అశోక్‌, ఈఎస్‌ నవీన్‌కుమార్‌, సీఐ నాగిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 

బీసీ సంఘాల నిరసన 

సర్వాయి పాపన్న జయంతి వేడుకలను నామమాత్రంగా నిర్వహించిన కలెక్టర్‌, అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రావుల రాజు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల వెంకటేశ్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా అధికారుల తీరును నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు.  పాపన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా కలెక్టర్‌ నిర్లక్ష్యంగా నిర్వహించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

నృత్య ప్రదర్శనలు ప్రారంభించిన కలెక్టర్‌ 

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో గెలుపొందిన క్రీడాకారులకు కలెక్టరేట్‌లో బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, దీపక్‌ తివారి, ఏసీపీ వెంకట్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌, యువజన క్రీడల శాఖ అధికారి ధనుంజయ్య, డీఏవో ఉపేందర్‌ రెడ్డి, అదనపు డీఆర్‌డీవో నాగిరెడ్డి, యువజన క్రీడల సంఘం అధ్యక్షుడు సరగడ కరణ్‌ పాల్గొన్నారు. 

విద్యతోనే అభివృద్ధి 

విద్యతోనే వ్యక్తిగత అభివృద్ధి, వికాసం సాధ్యమని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. మైనార్టీస్‌ డెవల్‌పమెంట్‌ కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలో ఆమె విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేసి, మాట్లాడారు. అబ్బాయిలో పాటు అమ్మాయిలు కూడా చదువుపై శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌కుమార్‌, కమిటీ అధ్యక్షుడు అఫీజ్‌ వసీం,సభ్యులు మోయినోద్దీన్‌, డాక్టర్‌ ఎస్‌ఎస్‌ అలీ, ఎండి సర్వర్‌, రఫీయోద్దీన్‌, డాక్టర్‌ అబ్దుల్‌ ఘనీ, షేక్‌ మీర పాల్గొన్నారు. 

కొలనుపాకలో ఈత వనాల పరిశీలన 

ఆలేరు రూరల్‌:గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. కొలనుపాకలో ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో నాటిన ఈత వనాలను ఆమె పరిశీలించారు. మొక్కల సంరక్షణకు ఫెన్సింగ్‌ను ఏర్పాటుచేయాలన్నారు. ఆమె వెంట అడిషనల్‌ కలెక్టర్‌  దీపక్‌తివారీ, ఎంపీడీవో జ్ఞాన ప్రకాశ్‌, ఎంపీవో సలీం, కొలనుపాక సర్పంచ్‌ ఆరుట్ల  లక్ష్మీప్రసాద్‌రెడ్డి, ఎక్సైజ్‌ అధికారులు, గౌడ సంఘం నేతలు ఉన్నారు. 

Updated Date - 2022-08-19T05:46:33+05:30 IST