Jul 27 2021 @ 12:53PM

ఇలాంటి సందర్భం ఒక్కసారైనా ఎదురై ఉంటుంది : ప్రియా ప్రకాష్

వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ 'ఇష్క్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. చాలా ఇంటెన్స్ ఫిల్మ్. కథంతా ఒక్క రాత్రిలో జరుగుతుంది. నేను 'ఓ బేబీ' చూశా.‌ అయితే, అప్పుడు తేజా సజ్జా పేరు తెలియదు. 'ఇష్క్' చేసినప్పుడు అతను అంటే ఏంటో తెలిసింది. చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా కథేంటో నేను చెప్పలేను గానీ... ప్రతి ఒక్కరికి జీవితంలో అటువంటి సందర్భం ఒక్కసారైనా ఎదురై ఉంటుంది.మలయాళంలో కంటెంట్ ఫిలిమ్స్ ఎక్కువ. తెలుగులో కమర్షియల్ సినిమా ఎక్కువ. రెండిటినీ బాలన్స్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగులో సందీప్ కిషన్ సరసన ఓ సినిమా చేస్తున్నా. మలయాళంలో కొత్త చిత్రాలు ఏవీ అంగీకరించలేదు. కంటెంట్ బేస్డ్ ఫిలిం కోసం ఎదురుచూస్తున్నా.. అని తెలిపింది. కాగా ఇటీవల ఈమె నితిన్‌తో నటించిన చెక్ సినిమా డిసప్పాయింట్ చేసిన విషయం తెలిసిందే.