కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట

ABN , First Publish Date - 2020-03-30T00:25:36+05:30 IST

కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట లభించింది. ఆదివారం ఒక్కరోజే 11 మంది కరోనా బాధితులకు నెగిటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయి. గతంలో నెగిటివ్‌గా మారిన రెండింటిని పాజిటివ్‌ కేసులుగా నిర్ధారించారు.

కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట

హైదరాబాద్: కరోనా నుంచి తెలంగాణకు స్వల్ప ఊరట లభించింది. ఆదివారం ఒక్కరోజే 11 మంది కరోనా బాధితులకు నెగిటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయి. గతంలో నెగిటివ్‌గా మారిన రెండింటిని పాజిటివ్‌ కేసులుగా నిర్ధారించారు. ఇప్పటి వరకు 67 మందికి పాజిటివ్‌ వస్తే అందులో 13 మందికి నెగిటివ్‌గా వచ్చాయి. ఈ వార్త తెలంగాణ సమాజానికి సంతోషాన్ని కల్గించింది. శనివారం రాష్ట్రంలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం మాత్రం అత్యధికంగా 14 కేసులను పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆదివారం మాత్రం కేవళం రెండు కేసులను మాత్రమే పాజిటివ్‌గా గుర్తించారు. ఇవాళ ఒక్క రోజే 11 మంది కరోనా బాధితులను నెగిటివ్‌గా నిర్ధారించారు. దీంతో తెలంగాణ ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటివరకు 54 మంది కరోనా బాధితులు ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారు. 


అయితే దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను మార్చి 22వ తేదీన విధించారు. ఆ తర్వాత మార్చి 23వ తేదీ నుంచి తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా, కరోనా సోకిన ఐదు రోజుల నుంచి 14 రోజుల మధ్య దాని లక్షణాలు బయటపడతాయి. అంటే, లాక్‌డౌన్‌కు ముందు మార్చి 15వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య చాలామంది విదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చారు. వారికి కరోనా సోకి ఉంటే.. సదరు వ్యక్తికి లక్షణాలు 20వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ బయటపడే అవకాశం ఉంది.

Updated Date - 2020-03-30T00:25:36+05:30 IST