Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో , ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుంది. తీరానికి వచ్చేకొద్దీ దిశ మార్చుకుని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఉత్తరకోస్తా తీరంలో 80 - 90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. 


Advertisement
Advertisement