గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!

ABN , First Publish Date - 2022-01-07T22:53:22+05:30 IST

గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి ప్రాణాలను.. ఏడేళ్ల కొడుకు కాపాడాడంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం తెలిసి వైద్యులు కూడా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..

గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!

ఏడేళ్ల చిన్నారులు ఏం చేస్తారంటే.. నిత్యం ఆటల్లో మునిగిపోతుంటారని చెబుతాం. కొందరు పిల్లలు ఆటలతో పాటూ పెద్దల బలవంతం మీద అప్పుడప్పుడూ కాసేపు పుస్తకాలు పడుతుంటారు. తెలిసి తెలీని వయసులో వారి దినచర్యలో ఇంతకంటే ఎక్కువ మార్పులు ఉండవు. పెద్దల గురించి ఆలోచించే స్ప‌ృహ కూడా వారికి ఉండదు. అయితే గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి ప్రాణాలను.. ఏడేళ్ల కొడుకు కాపాడాడంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం తెలిసి వైద్యులు కూడా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..


యూపీలోని అయోధ్య పరిధి ఉద్నా సంజయ్‌నగర్‌లో మంజు పాండే(40) అనే మహిళ.. భర్త, కుమారుడు రాహుల్(7)తో కలిసి నివాసం ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం మంజు పాండే ఉన్నట్టుండి వాంతులు చేసుకుంది. దీంతో పాటు చేతులు, కాళ్లు వణుకుతుండడంతో కాసేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే ఉన్న చిన్నారి రాహుల్ గమనించాడు. వేరే పిల్లలైతే తమ లోకంలో తాము ఉండేవారు. కానీ రాహుల్ మాత్రం అలా కాకుండా వెంటనే ఫోన్ తీసుకుని.. 108కి ఫోన్ చేసి, తల్లి పరిస్థితిని వివరించాడు.

చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్.. బాలికలతో ఏం చేయించిస్తున్నారో తెలుసా.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..


ఫోన్ చేసిన ఐదు నిముషాల్లోనే అంబులెన్స్ అక్కడికి వచ్చింది. ఆమెకు ఇంట్లోనే ప్రాథమిక చికిత్స నిర్వహించి, సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. ఆమెకు గుండెపోటు వచ్చినట్లు గుర్తించారు. గంట ఆసల్యమై ఉంటే ఆమె ప్రాణాలకే ప్రమాదం కలిగేదని చెప్పారు. ఏడేళ్ల చిన్నారి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడని తెలుసుకుని వైద్యులు ఆశ్చర్యపోయారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ చిన్నారులకు ఆటలతో పాటూ ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Updated Date - 2022-01-07T22:53:22+05:30 IST