Oct 23 2021 @ 08:12AM

'పెళ్ళి సందD' హీరోయిన్‌కు వరుస ఆఫర్స్..?

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు ద్సర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన తాజా చిత్రం 'పెళ్ళి సందD'. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన యంగ్ బ్యూటీ శ్రీలీలకి వరుసగా క్రేజీ ఆఫర్ వస్తున్నాయట. సీనియర్ హీరో.. అప్పటి 'పెళ్ళి సందడి' సినిమాతో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీలా జంటగా తెరకెక్కిన 'పెళ్ళి సందD' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ డైరెక్టర్ గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ శ్రీలీలకి పర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. మంచి హుషారుగా డాన్స్ కూడా ఆమె బాగానే చేసింది. దాంతో కొత్తగా తెలుగుతెరకి పరిచయం అయిన శ్రీలీలకు యంగ్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయట. 

ఇప్పటికే 5-6 సినిమాలు చర్చలదశలో ఉన్నట్టు సమాచారం. అఫీషియల్‌గా మాత్రం మాస్ మహారాజ రవితేజ - త్రినాథ్ రావు నక్కిన కాంబినేషన్‌లో ఇటీవల ప్రారంభమైన సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైంది. ఈ మధ్య ఒక్క సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న యంగ్ హీరోయిన్స్‌కు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. అందుకు ఉదాహరణ 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి..'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ. మరి 'పెళ్ళి సందD' హీరోయిన్ శ్రీలీల ఏలా దూసుకెళుతుందో చూడాలి.