నేడు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-07-04T09:43:08+05:30 IST

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా తెలంగాణ కాంగ్రె్‌సలో పుట్టిన కాక..

నేడు సంచలన ప్రకటన చేస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా రాక సందర్భంగా తెలంగాణ కాంగ్రె్‌సలో పుట్టిన కాక.. ఆదివారమూ కొనసాగింది. సోమవారం తాను సంచలన ప్రకటన చేయబోతున్నానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తాను మీడియా మందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి తెచ్చింది టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డేనని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలో అంతర్గత విషయాల గురించి గతంలో తాము మీడియా ఎదుట మాట్లాడినప్పుడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్‌గాంధీకి రేవంత్‌ టీమ్‌ ఫిర్యాదులు చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో రాహుల్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశం జరిగిందని గుర్తు చేశారు. అది జరిగి... మూడు నెలలు దాటినా రేవంత్‌ తీరు మారలేదని, అయినా తాము మీడియా ముందుకు వచ్చి మా ట్లాడలేదని వెల్లడించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా హైదరాబా ద్‌ పర్యటన విషయమై పార్టీ ఎమ్మెల్యేలు, ఎం పీలతో రేవంత్‌ ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదని, కానీ.. తమతో మాట్లాడినట్లుగా మీడియాకు చెప్పారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న విషయాన్ని మరిచి.. గోడకు వేసి కొడుతానంటూ అమర్యాదకరంగా మాట్లాడారని విమర్శించారు.


రేవంత్‌ వ్యాఖ్యలపై తానూ అదే రీతిలో స్పందించాల్సి వచ్చిందని వివరించారు. పార్టీ నాయకుల గురించి మీడియా ఎదుట మాట్లాడబోనంటూ గతంలో రాహుల్‌గాంధీకి మాట ఇచ్చానని, దాన్ని తప్పినందుకు చాలా ఇబ్బంది పడుతున్నానని పే ర్కొన్నారు. కాంగ్రెస్‌కు రాజకీయంగా అనుకోకుండా ఏదైనా నష్టం జరిగినా, తనపైనే నెట్టేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తారని విమర్శించారు. గతంలోనూ రేవంత్‌ అత్యుత్సాహం వల్లే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9ఏళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణలో రాజకీయంగా కనుమరుగయ్యారని వ్యాఖ్యానించారు. ఒక రా జకీయ యుద ్ధం చేయాలంటే దానికి ఒక  వ్యూహం ఉండాలని, ఆ యుద్ధం చేసే అధిపతి అందరినీ కలుపుకొని వెళ్లాలని అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి అలా వ్యవహరించడం లేద ని, దీనిపై  ఆలోచన చేయాలని కోరారు.

Updated Date - 2022-07-04T09:43:08+05:30 IST