ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-09-22T10:45:38+05:30 IST

పట్టణంలో ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు పాతబస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు గ

ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలి

 వామపక్షాల రాస్తారోకో 

 స్తంభించిన ట్రాఫిక్‌


కోడుమూరు, సెప్టెంబరు 21: పట్టణంలో ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు పాతబస్టాండ్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు గంటసేపు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు గఫూర్‌మియ్య మాట్లాడుతూ ఇసుక రవాణా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఈ విషయాన్ని  అధికారులు, ప్రజాప్రతి నిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున వామపక్ష నాయకులతో చర్చలు జరిపారు. ఈ విషయాన్ని కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్‌కు సీఐ ఫోన్‌ ద్వారా తెలిపారు. త్వరలోనే ఇసుక సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని సీఐ తెలపడంతో వారు రాస్తారోకో విరమించారు. కార్యక్ర మంలో సీపీఐ, సీపీఎం నాయకులు రాజు, వీరన్న, క్రిష్ణ పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-22T10:45:38+05:30 IST