ప్రజాస్వామ్యానికి పాదాభివందనం

ABN , First Publish Date - 2022-08-20T10:13:30+05:30 IST

ము నుగోడులో టీఆర్‌ఎస్‌, బీజేపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ప్రజాస్వామ్యానికి పాదాభివందనం

నేటి నుంచి మునుగోడులో ప్రచారం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి 

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ము నుగోడులో టీఆర్‌ఎస్‌, బీజేపీ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. వేరే పార్టీల నాయకులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయన్నారు. మునుగోడులో అధికార పార్టీల అక్రమాలను అడ్డుకోవాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్య మం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని కాం గ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ కో-ఆర్డినేటర్లతో జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు  ప్రకటించారు. తన తో సహా వెయ్యి మంది కాంగ్రెస్‌ నా యకులు.. ఒక్కో నాయకుడు 100 మం ది ఓటర్లకు వందనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరతారని చెప్పా రు. మునుగోడులోని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను కలిసి వారికి పాదాభివందనం చేస్తారని తెలిపారు.  ఇదిలా ఉండగా, మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శనివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు టీపీసీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో  రాష్ట్ర స్థాయి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించడానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసింది. ఇందు కోసం గ్రా మాల వారీగా పార్టీ ఇన్‌చార్జిలను నియమించింది. ఈ వివరాలను రేవంత్‌ పార్టీ కో-ఆర్డినేటర్లకు వెల్లడించారు. శనివారం ఉదయమే మనుగోడులోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలన్నారు. 


ఉద్యోగాలపై మాట తప్పిన మోదీ: వీహెచ్‌ 

ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పి ప్రధాని మోదీ మాట తప్పారని పీసీసీ మాజీ అధ్యక్షు డు హన్మంతరావు విమర్శించారు. రాజీవ్‌ గాంధీ ఎలాం టి హామీలు ఇవ్వకుండానే ఉద్యోగలిచ్చారని గుర్తు చేశా రు. శుక్రవారం హన్మంతరావు గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. పాల మీద కూడా జీఎస్టీ వేస్తున్నారని విమర్శించారు. 


ప్రచారం కోసం స్టిక్కర్లు

మునుగోడు ఎన్నిక ప్రచారాన్ని శనివారం నుంచే ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో రేవంత్‌.. ‘మన మునుగోడు. మన కాంగ్రెస్‌’ నినాదంతో రాజీవ్‌ గాంధీ, చేతి గుర్తుతో రూపొందించిన ప్రత్యేక స్టిక్కర్లను శుక్రవారం విడుదల చేశారు. శనివారం ఉదయం 176 గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలు పార్టీ జెండాలు ఎగురవేసి రాజీవ్‌కు నివాళులర్పిస్తారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచార స్టిక్కర్లను అందిస్తారు. రేవంత్‌ రెడ్డి సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం పొర్లగడ్డ తండాలో రాజీవ్‌ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రచారం నిర్వహిస్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌, జానారెడ్డి తదితర సీనియర్‌ నాయకులు వేర్వేరు మండలాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు.

Updated Date - 2022-08-20T10:13:30+05:30 IST