ఐక్యరాజ్యసమితిలో Russian diplomat రాజీనామా

ABN , First Publish Date - 2022-05-24T15:42:00+05:30 IST

ఐక్యరాజ్యసమితిలో రష్యా దౌత్యవేత్తగా పనిచేస్తున్న బోరిస్ బొండరెవ్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది....

ఐక్యరాజ్యసమితిలో Russian diplomat రాజీనామా

జెనీవా: ఐక్యరాజ్యసమితిలో రష్యా దౌత్యవేత్తగా పనిచేస్తున్న బోరిస్ బొండరెవ్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధానికి నిరసనగా తాను ఐరాస దౌత్యవేత్తగా రాజీనామా చేస్తున్నట్లు బోరిస్ ప్రకటించారు.తన రాజీనామా లేఖను సోమవారం విడుదల చేశారు. అత్యంత ఉన్నత పదవిలో ఉన్న సీనియర్ దౌత్యవేత్త రాజీనామా చేయడం రష్యాలోని పుతిన్ సర్కారుకు తలనొప్పిగా మారింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం ప్రకటించడం పట్ల తాను ఎంతో సిగ్గు పడ్డానని బోరిస్ చెప్పారు. యుద్ధం చేయడం రష్యాలోని చాలామంది అధికారులకు ఇష్టం లేదని, అయినా తాము ఏం మాట్లాడకుండా కూర్చోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. విలాసవంతమైన భవనాల్లో నివశించే వారు యుద్ధం ఆలోచన చేస్తారని పుతిన్ ను బోరిస్ విమర్శించారు. రష్యా విదేశాంగశాఖపై బోరిస్ విమర్శలు గుప్పించారు.


Updated Date - 2022-05-24T15:42:00+05:30 IST