Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండుగా చీలిన బండరాయి... Aliens పనేనని అనుమానం.. ఇంతకీ అదెక్కడుందంటే..!

కొండల్లో కొన్ని బండరాళ్లు చిత్ర విచిత్ర ఆకృతుల్లో ఉంటాయి. కొన్ని మనుషుల ఆకారంలో ఉంటే.. మరికొన్ని మీద పడేటట్లుగా ఉంటాయి. ఎవరో అలా ఏర్పాటు చేశారా అన్నంత ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బండరాయిని చూస్తే మాత్రం ఎవరో, ఏదో చేశారు.. అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అందపెద్ద రాయి మధ్యలో ఎవరో కత్తితో కోసినట్లుగా ఉండడంతో పలువురు ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. కొండల్లో కాకుండా ఓ ఎడారిలో ఉండడంతో ఈ పని ఎవరు చేసుంటారు.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. కొందరు మాత్రం.. ఇది ఏలియన్స్ పనే అని ఖచ్చితంగా చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పురావస్తు


సౌదీ అరేబియాలోని తమ్యా ఒయాసిస్ ప్రాంతంలో ఈ రాయిని చూడొచ్చు. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో ఉంటుంది. 4వేల ఏళ్ల నాటి పురాతన ఇసుక రాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రాయి చుట్టూ అంతా ఎడారే. అందుకే ఇక్కడికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఒక వస్తువును కత్తితో సమానంగా కోస్తే ఎంత ఖచ్చితంగా విడిపోతుందో.. అలానే ఉంటుంది ఈ రాయి. దీంతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందని కొందరు చెబుతుంటే.. ఇంకొదరు మాత్రం ఇది ఖచ్చితంగా ఏలియన్స్ పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత ఖచ్చితంగా మధ్యలోకి విడిపోయిందంటే.. ఇలా చేయడం మనుషుల వల్ల అయ్యే పని కాదని చెబుతున్నారు. ఏలియన్స్ వల్లే ఇది సాధ్యమవుతుందని, లేజర్ కిరణాల ద్వారా ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఇలా పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.


అయితే పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం.. వాతావరణ ప్రభావంతోనే ఇలా జరుగుతుందని అంటున్నారు. వాతావరణంలో చల్లదనం పెరిగినప్పుడు.. రాయిలోని నీరు గడ్డకడుతుందన్నారు. అది క్రమంగా పగుళ్లకు దారి తీస్తుందని చెబుతున్నారు. కొన్నేళ్ల పాటు జరిగే ప్రక్రియతో ఇలా అవుతుందట. మనుషులు, ఏలియన్స్ వల్ల జరుగుతుందనడం.. కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ బండరాయి చూసేందుకు.. పర్యాటకులు ఎగబడుతున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement